Dharma Productions: ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. కానీ ఇతర భాషల్లో మాత్రం ఈ చిత్రం అంతంత మాత్రం గానే ఆడింది. హిందీ లో ఈ సినిమాకి 55 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. హిందీ లో మంచి రేటింగ్స్ వచ్చినప్పటికీ కూడా ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా హిందీ రైట్స్ ని ప్రముఖ దర్శకుడు/నిర్మాత కరణ్ జోహార్ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూపాయి నష్టం కూడా రాలేదు కానీ, ఇప్పుడు ఆయన తన ఆస్తులను 50 శాతం వరకు అమ్ముకోవడం పెద్ద చర్చకు దారి తీసింది. బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన కల్ట్ క్లాసిక్ చిత్రాలను తీసి వేల కోట్లు సంపాదించిన కరణ్ జోహార్ కి అకస్మాత్తుగా ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.
పూర్తి వివరాల్లోకి వెళ్తే వ్యాక్సిన్ తయారీ సంస్థ, సీరం ఇన్ స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల పెట్టుబడులు కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ లో పెట్టాడు. దీంతో ధర్మ ప్రొడక్షన్స్ లోని 50 శాతం వాటా అదర్ పూనావాలా నిర్మాణ సంస్థ అయినటువంటి సెరెన్ ప్రొడక్షన్స్ దక్కించుకోనుంది. ఈ మేరకు వీళ్లిద్దరి మధ్య ఇటీవలే ఒప్పందం జరిగింది. ఈ ఒప్పదం తర్వాత ధర్మ ప్రొడక్షన్స్ విలువ రెండు వేల కోట్ల రూపాయలకు ఎగబాకిందని తెలుస్తుంది. ఇక ధర్మ ప్రొడక్షన్స్ నుండి విడుదలయ్యే ప్రతీ సినిమా/ వెబ్ సిరీస్/ టీవీ షోస్ కి సంబంధించిన ఆదాయంలో 50 శాతం సెరెన్ ప్రొడక్షన్స్ కి చెందుతుంది. అంతే కాదు నష్టాల్లో కూడా సెరెన్ సంస్థ 50 శాతం భవిష్యత్తులో పంచుకోవాల్సిందే. రీసెంట్ గానే దేవర చిత్రాన్ని విడుదల చేసిన ‘ధర్మ ప్రొడక్షన్స్’ కి భారీ లాభాలు రాలేదు, అదే విధంగా నష్టాలు కూడా రాలేదు.
కానీ అలియా భట్ ని ప్రధాన పాత్రలో పెట్టి తీసిన ‘జిగ్రా’ చిత్రం మాత్రం ఇటీవలే విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇది ఇలా ఉండగా గతం లో రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ‘ధర్మ ప్రొడక్షన్స్’ సంస్థ ని కొనుగోలు చేసేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు చేసాడట. కానీ అందుకు కరణ్ జోహార్ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు అదర్ పూనావాలా కి 50 శాతం వాటాలు ఇచ్చేందుకు ముందుకు రావడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకు కరణ్ జోహార్ భాగస్వామ్యం కోసం మరొకరితో చేతులు కలపాల్సి వచ్చింది?, ప్రస్తుతం ‘ధర్మ ప్రొడక్షన్స్’ సంస్థ నష్టాల్లో నడుస్తుందా?, నెలసరి ఆదాయం బాగా తగ్గిపోయిందా?, అందుకే ఇంకొకరి తోడుని కరణ్ జోహార్ కోరుకున్నాడా వంటి చర్చలు ఇప్పుడు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో కొనసాగుతున్నాయి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Adar poonawala who bought 50 percent share in dharma productions 1000 crore deal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com