Actors Who Married Directors: ప్రేమకు ఎల్లలు లేవు. అది ఎవరిపైనైనా ఎప్పుడైనా కలగొచ్చు. నటనలో భాగంగా హీరోయిన్స్ హీరోలతో రొమాన్స్ కురిపిస్తూ ఉంటారు. ఆ క్రమంలో కొందరు హీరోయిన్స్ నిజంగానే హీరోల ప్రేమలో పడతారు. హీరోలను వివాహం చేసుకుంటారు. భిన్నంగా కొందరు హీరోయిన్స్ తమ డైరెక్టర్స్ ని ప్రేమిస్తారు.

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో పడింది. నానుమ్ రౌడీదాన్ మూవీ షూటింగ్ సమయంలో నయనతార-విగ్నేష్ మధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్ళికి దారితీసింది. ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట జూన్ 9న వివాహం చేసుకున్నారు. నయనతార మాదిరే చాలా మంది హీరోయిన్స్ తమ డైరెక్టర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Also Read: Pawan Kalyan Emotional : ఆ వీడియో చూసి ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్
90లలో రోజా స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఏలారు. తెలుగులో కంటే ఆమె ఎక్కువగా తమిళంలో చిత్రాలు చేశారు. రోజా దర్శకుడు సెల్వమణి దర్శకత్వంలో తమిళంలో అధికంగా సినిమాలు చేశారు. ఈ క్రమంలో రోజా ఆయన్నే ప్రేమించి పెళ్లి చేసుకుంది.
తలైవి ఫేమ్ దర్శకుడు ఏ.ఎల్.విజయ్‌ను హీరోయిన్ అమలా పాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంత కాలం హ్యాపీ లైఫ్ అనుభవించిన ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. విజయ్ మరో వివాహం చేసుకోగా అమలాపాల్ ఇంకా సింగిల్ గా ఉన్నారు. ప్రస్తుతం విజయ్, అమలాపాల్ ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా ఉన్నారు.

మురారి, మన్మథుడు, ఇంద్ర వంటి హిట్ చిత్రాలలో నటించిన సోనాలి బింద్రే టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా రాణించారు.బాలీవుడ్ లో కూడా ఫాలోయింగ్ సంపాదించిన సోనాలీ ప్రముఖ నిర్మాత, దర్శకుడు గోల్డీ బెహెల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. క్యాన్సర్ బారిన పడిన సోనాలీ బింద్రే.. తిరిగి కోలుకున్నారు. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మూవీతో గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణి… వసంతం, కబడ్డీ కబడ్డీ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. తర్వాత ఆమె దర్శకుడు సూర్య కిరణ్ ని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సత్యం సినిమాతో మంచి హిట్ కొట్టిన సూర్య కిరణ్ కి తర్వాత బ్రేక్ రాలేదు. కొన్నాళ్ళకు సూర్య కిరణ్ తో కళ్యాణి విడిపోయింది.
హీరోయిన్ రమ్యకృష్ణను ప్రేమ వివాహాం చేసుకున్నాడు స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఆయన దర్శకత్వంలో హీరోయిన్‌గా చంద్రలేఖ సినిమాలో నటించింది సీనియర్ హీరోయిన్. ఆ తర్వాత ఇరువురి మనసులు ఒక్కటయ్యాయి… పెళ్లి వరకూ వెళ్లారు.
హీరోయిన్ యామీ గౌతమ్ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యను 2021లో వివాహం చేసుకున్నారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.

ప్రముఖ నటి 7 జీ బృందావన్ కాలనీ ఫేమ్ హీరోయిన్ సోనియా అగర్వాల్ దర్శకుడు సెల్వ రాఘవన్ ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. 7 జీ బృందావన్ కాలనీ చిత్రీకరణ సమయంలో వీరి మధ్య ప్రేమ పుట్టింది.ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట కొంతకాలానికి విడిపోయారు. మరో సీనియర్ హీరోయిన్ సుహాసిని సైతం డైరెక్టర్ ని వివాహం చేసుకున్నారు. డైరెక్టర్ మణిరత్నంతో ఆమెకు వివాహం జరిగింది. అలాగే హీరోయిన్ కుష్బూ డైరెక్టర్ సుందర్ ను పెళ్లాడారు.
Also Read:Rajamouli- Mahesh Babu: మహేష్ విషయంలో రాజమౌళి కన్ఫ్యూజ్ అవుతున్నారా?… ఆయన సెలక్షన్ బాగాలేదే!