Actress Vijayalakshmi: ఈ మధ్య ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ కొందరు సెల్ఫీ వీడియాలతో ముందుగానే వారి చావు వార్తను చెబుతున్నారు. మరికొందరు లైవ్ లోనే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటివి చూసి వెంటనే స్పందిస్తే వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. కానీ ఎవరికి అందుబాటులో లేని ప్లేస్ లో ఉండి మరీ వారు ఆత్మహత్య చేసుకుంటే కాపాడడం కూడా కష్టమే. ఇక ఇలాంటి ఆత్మహత్యలు సామాన్య జనాలు మాత్రమే కాదు సెలబ్రెటీలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా ఓ నటి ఇలాంటి పనే చేసింది. ఇంతకీ ఆమె ఎవరు? ఏమైంది అంటే..
తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ప్రముఖ తమిళ నటి విజయలక్ష్మి ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో నెట్టింట కలకలం సృష్టిస్తుంది. నిన్న ఈ వీడియోను విడుదల చేసింది విజయలక్ష్మి. అందులో ఏం మాట్లాడిందంటే..మీడియా మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 29న నేను ఓ వీడియో విడుదల చేశాను. నామ్ తమిళ కర్ కట్చి సమన్వయకర్త సీమాన్ నాతో మాట్లాడిందట.. తనతో కలిసి జీవించాలని కోరుతూ ఓ వీడియో పంపిందట. ఆవేదనతో కూడిన వీడియోను పంపింది విజయలక్ష్మి.
తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మూడేళ్లు తనతో రిలేషన్ లో ఉన్నాడట. అంతేకాదు తన జీవితం నాశనం చేశాడని.. తనను నడి రోడ్డు మీద వదిలేశాడని.. అంటూ తాజా వీడియోలో పేర్కొంది. మార్చి 5వ తేదీ వరకు గడువు ఇచ్చిందట. లేదంటే ఆత్మహత్య చేసుకుంటాను అని తెలిపిందట. తాను ఇచ్చిన గడువు ఆ తేదీ పూర్తైంది అని..దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని వీడియోలో తెలిపింది. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ప్రస్తుతం సహకరించడం లేదని.. ఎవరైన తనకు సహకరిస్తే వారిని తరిమి కొడుతున్నాడు అని ఆవేదన చెందింది.
ప్రస్తుతం కర్ణాటకలో జీవించలేని పరిస్థితి అని.. అందుకే ఇదే తన చివరి వీడియో.. అంటూ ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పింది. అంతేకాదు కర్ణాటక పోలీసులు తదుపరి వార్త చెబుతారని.. తన మరణంపై సీమాన్ వివరణ ఇవ్వాలి అంటూ పేర్కొంది విజయలక్ష్మి. మరి ఈ వీడియో తర్వాత ఏం జరిగింది అనే విషయాలు తెలియాల్సి ఉంది.