Actress Tapsee: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో గత కొంతకాలంగా బయోపిక్ లను తెరకెక్కించి హిట్ లు అందుకుంటున్నారు నటీనటులు. ఇటీవల విడుదలైన షేర్ షా, ఉద్దం సింగ్ చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రీడాకారుల బయోపిక్‌లు ఎక్కువగా వస్తు్న్నాయి. ఇప్పటికే ధోనీ, మేరీకోమ్, అజహరుద్దీన్, సచిన్, మిల్కాసింగ్, సైనాల జీవిత కథలతో రూపొందిన సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. త్వరలోనే రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 83 సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని 1983 వరల్డ్ కప్ నేపధ్యంలో కపిల్ దేవ్ మీద తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్‌లో మరో క్రీడాకారిణి బయోపిక్ రానుంది.
భారత మహిళల క్రికెట్‌లో ‘లేడీ సచిన్’ అని గుర్తింపు పొందిన హైదరాబాదీ క్రికెటర్ ‘మిథాలీ రాజ్’ జీవిత కథను వెండితెరపై ‘శభాష్ మిథూ’ గా ఆవిష్కరించనున్నారు. బాలీవుడ్‌లో మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన తాప్సీ పన్ను ఈ మూవీలో టైటిల్ రోల్ పోషిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.
ONE GIRL with HER CRICKET BAT has shattered world records and stereotypes.
You’ve done it all Champ… Happy Birthday Mithu @M_Raj03 🥳#ShabaashMithu in theatres on 4|02|2022.@taapsee @ActorVijayRaaz @AndhareAjit @priyaaven pic.twitter.com/WA9VXn7Wq3— Viacom18 Studios (@Viacom18Studios) December 3, 2021
వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇటీవల మిథాలీ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా విడుదల తేదీని మూవీ యూనిట్ ప్రకటించింది. ‘ఒక అమ్మాయి తన బ్యాట్‌తో మూస పద్ధతులతో పాటు క్రికెట్‌లోని రికార్డులను ఎలా బద్దలు కొట్టిందో ఈ సినిమాలో చూపించనున్నాం. ఆమె నిజమైన ఛాంపియన్ అని పోస్ట్ చేశారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Actress tapsee new movie shabhash mithu releasing on february 4th
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com