Actress Tabu: చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ కూడా పలువురు సీనియర్ హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వారిలో టబు కూడా ఒకరనే చెప్పాలి. తెలుగు, హింది, పలు భాషల్లో నటించి ప్రేక్షకుల్లో ఎంతో పేరు పొందారు. నిన్నే పెళ్లాడతా, కూలీ నెంబర్ 1, అందరివాడు, చెన్నకేశవ రెడ్డి, పాండురంగడు… అలా వైకుంఠపురంలో వంటి సినిమాలతో తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు టబు. ఇటీవల అల్లు అర్జున్ సినిమాలో తల్లి పాత్రలో కూడా స్టైలిష్‌గానే కనిపించారు టబు. ఈ వయసులో కూడా సినిమాల్లో బిజీగా గడిపేస్తున్నారు టబు. కానీ టబు ఎందుకు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్నలు ఎప్పటి నుంచో ఆమెను అడుగుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యులో పెళ్లి గురించి తన మనసులో మాటను బయటపెట్టింది టబు.

తాను పెళ్లి చేసుకోకుండా ఉండడానికి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కారణమని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది టబు. టబుకు అజయ్ దేవ్ గన్ 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే పరిచయం ఉన్నారంట. అజయ్ తన అన్న స్నేహితుడని, అలా వారి మధ్య పరిచయం ఏర్పడింది అని చెప్పారు టబు. అజయ్ టబును ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండేవాడని… తనతో ఎవరైనా మాట్లాడినా తట్టుకోలేకపోయేవాడని తెలిపారు. అలానే అబ్బాయిలు ఎవరైనా తనతో క్లోజ్‌గా మాట్లాడితే వారిని కొట్టడానికి కూడా రెడీ అయ్యేవాడని వివరించారు టబు. అజయ్ దేవ్ గన్ వల్లే తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని వెల్లడించింది టబు. ప్రస్తుతం టబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. కానీ ఇప్పటికీ కూడా టబు, అజయ్ కలిసి పలు సినిమాల్లో నటించారు.