https://oktelugu.com/

Taapsee Pannu: నా సెక్స్ లైఫ్ కొత్తగా ఏం లేదుగా.. అందుకే నన్ను పిలవలేదు.. తాప్సీ సంచలన కామెంట్స్ !

Taapsee Pannu: తెలుగు తెర పై పూసిన సొట్టబుగ్గల మందారం ‘తాప్సీ’. ఐతే తెలుగులో సక్సెస్ రాకముందే తమిళంకి అటు నుండి హిందీకి పరవళ్లు తొక్కింది. పైగా త‌క్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సాధించిన హీరోయిన్ గా తాప్సీ బాలీవుడ్ లో తనను తానూ బాగా ప్రమోట్ చేసుకుంది. ప్రమోషన్ అయితే బాగానే చేసుకుంటుంది గానీ, ఇంతవరకు అక్కడ కూడా అమ్మడుకి స్టార్ డమ్ రాలేదు. రాపోయినా.. తన బోల్డ్ కామెంట్స్ తో బాలీవుడ్ ను మాత్రం […]

Written By:
  • Shiva
  • , Updated On : August 8, 2022 / 02:27 PM IST
    Follow us on

    Taapsee Pannu: తెలుగు తెర పై పూసిన సొట్టబుగ్గల మందారం ‘తాప్సీ’. ఐతే తెలుగులో సక్సెస్ రాకముందే తమిళంకి అటు నుండి హిందీకి పరవళ్లు తొక్కింది. పైగా త‌క్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సాధించిన హీరోయిన్ గా తాప్సీ బాలీవుడ్ లో తనను తానూ బాగా ప్రమోట్ చేసుకుంది. ప్రమోషన్ అయితే బాగానే చేసుకుంటుంది గానీ, ఇంతవరకు అక్కడ కూడా అమ్మడుకి స్టార్ డమ్ రాలేదు. రాపోయినా.. తన బోల్డ్ కామెంట్స్ తో బాలీవుడ్ ను మాత్రం ఒక ఊపు ఊపేస్తోంది.

    Taapsee Pannu

    తాజాగా మరోసారి తాప్సీ బోల్డ్ కామెంట్స్ చేసి వార్తలకెక్కింది. తాప్సీ నటించిన కొత్త చిత్రం ‘దొబారా’. ఆగస్టు 19న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అందుకే.. తాప్సీ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యులు ఇస్తోంది. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా నెటిజన్లతో టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే తాప్సీ కరణ్ జోహర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

    సహజంగా ఏ సినిమా అయితే రిలీజ్ అవుతుందో ఆ సినిమాకి సంబంధించిన స్టార్స్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొంటారు. ఎలాగూ తాప్సీ ‘దొబారా’ సినిమా రిలీజ్ కాబోతుంది. అందుకే, ఓ నెటిజన్ ‘మీరెందుకు ‘కాఫీ విత్ కరణ్’ షోకి వెళ్లలేదు ? అని తాప్సీని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు “నా సెక్స్ లైఫ్ కొత్తగా ఏం లేదుగా.. అందుకే ఆ షో నుంచి నాకు పిలుపు రాలేదు.

    Taapsee Pannu

    పైగా నా లైఫ్ లో ఆసక్తికర శృంగార అంశాలు కూడా ఏమీ లేవు’ అంటూ కరణ్ పై పరోక్షంగా తాప్సీ తన అక్కసు వెళ్లగక్కింది. మొత్తానికి బోల్డ్ ఆన్సర్ ఇచ్చి తాప్సీ షాకిచ్చింది. నిజానికి ఈ మధ్య కరణ్ ఇంటర్వ్యులు చూస్తే వరుసగా అన్ని సెక్స్ ప్రశ్నలే హైలైట్ అవుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే తాప్సీ పై విధంగా స్పదించింది.

    మొత్తానికి తాప్సీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి కరణ్, తాప్సీ కామెంట్స్ పై ఎలా స్పందిస్తాడో చూడాలి.

    Tags