
Surekha Vani: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి తెలియని వారుండరు. మొదట న్యూస్ రీడర్, సీరియల్ నటి, తరువాత సినిమాల్లో ప్రవేశించి తనదైన పాత్రలతో అందరిని అలరిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు ప్రేక్షకులను పలకరించే ఆమెపై ఎన్నో కామెంట్లు వస్తుంటాయి. ఇందులో భాగంగానే ఆమె రెండో పెళ్లిపై కూడా పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె రెండో వివాహం చేసుకుందని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువైంది.
సీరియల్స్ నటించే సమయంలోనే దర్శకుడు సురేష్ తేజ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆయన అనారోగ్య కారణాలతో చనిపోవడంతో ఇక అప్పటి నుంచి ఒంటరిగా ఉండిపోతోంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్ చేస్తూ ఉంటారు. సినిమాల్లో సంప్రదాయ బద్ధంగా కనిపించే ఆమె సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ డ్రెస్సులతో పలకరించే ఆమెపై ఎన్నో కామెంట్లు చేస్తుంటారు.
పెళ్లి వయసుకు వచ్చిన కూతురున్నా ఆమె డ్రెస్సులు వేసుకోవడంపై కూడా పలు రకాల కామెంట్లు వచ్చినా ఆమె పట్టించుకోదు. కానీ ఇటీవల ఆమె ఓ ఫొటో షేర్ చేయగా అందులో మెడలో తాళి కనిపించింది. దీంతో ఆమె రెండో వివాహం చేసుకుందని పలు కామెంట్లు వచ్చాయి. కానీ ఆమె మాత్రం స్పందించలేదు. నెటిజన్లు పెట్టే పోస్టింగులకు ఏ మాత్రం వెరవకుండా తనదైన శైలిలో దూసుకుపోతోంది.
ఇటీవల అలీతో సరదాగా కార్యక్రమంలో రెండో పెళ్లిపై మీ అభిప్రాయం అని అడిగితే ఎవరైనా ఉంటే చూడండి అని అతడినే ఎదురు ప్రశ్నించింది. దీంతో ఎటువంటి వారు కావాలని అడిగితే బాగా డబ్బున్న వాడు కావాలని చెప్పి మరోసారి వార్తల్లో నిలిచింది. మససున్న వాడు కావాలా? డబ్బున్నవాడా అని అడిగితే డబ్బున్న వాడు అయితేనే బాగుంటుందని తన మనసులోని మాట బయటపెట్టింది.