Homeఎంటర్టైన్మెంట్Sunnyleone: ఆ వ్యాపారంలో అడుగుపెట్టిన తొలి భారతీయ నటి సన్నీలియోన్​!

Sunnyleone: ఆ వ్యాపారంలో అడుగుపెట్టిన తొలి భారతీయ నటి సన్నీలియోన్​!

Sunnyleone: ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీ చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పద్దతిని ప్రోత్సహించడంలో భాగంగా అమితాబ్​ బచ్చన్​, రజనీకాంత్​, సల్మాన్​ఖాన్​ స్టార్​లు ఎన్​ఎఫ్​టీ  వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్‌ఎఫ్‌టీ అంటే ఓ డిజిటల్‌ బిజినెస్‌. ఇందులో భాగంగా సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, సినిమాలు, ప్రత్యేక ఫొటోలు, వీడియోలను డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి వేలంలో విక్రయిస్తారు. ఇదంతా బ్లాక్​చెయిన్​ టెక్నాలజీ పద్దతిలో జరుగుతుంటుంది. ఈ డిజిటల్​ ఆస్తులను ఎవ్వరైనా వేలం ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఎన్​ఎఫ్​టీలను కొనుగోలు చేసినవారు తిరిగి వాటిని వేలం వేసుకునే వెసులుబాటు ఉంది. అలా వేలం జరిగిన ప్రతిసారి వేలం మొత్తంలో 10శాతం ఎన్​ఎఫ్​టీ క్రియేటర్లకు వాటాగా వెళ్తుంటుంది.

తాజాగా, బాలీవుడ్​ బ్యూటీ సన్నీ లియోన్​ ఈ ఎన్​ఎఫ్​టీ బిజినెస్​లోకి అడుగుపెట్టింది. దీంతో ఈ వ్యాపారంలో అడుగుపెట్టిన తొలి భారతీయ నటిగా గుర్తింపు దక్కించుకుంది. కాగా, మిస్​ ఫిట్​ పేరుతో తన ఎన్​ఎఫ్​టీ వివరాలను సోషల్​ మీడియాలో షేర్​ చేయడం మొదలుపెట్టింది. ‘ మిస్‌ ఫిట్​ను కలవండి. ఆమెకు గులాబీ రంగు అంటే ఎంతో ఇష్టం. ట్యాటూలు వేయించుకోవాలన్నా, అబ్బాయిలన్నా ఇష్టమే. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు. సన్నీ లియోన్‌ ఎన్‌ఎఫ్‌టీలు సిద్ధంగా ఉన్నాయి ‘ అని సన్నీ పేర్కొంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version