Actress samantha: ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి సమంత. ఆ తర్వాత ఆమె నిజంగానే అందర్నీ మాయే చేసింది అని చెప్పాలి. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన సామ్… తనదైన నటనతో దూసుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పాలి. ఇటీవల నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది సమంత. ఆ ప్రకటనకు ముందు, ప్రకటన తర్వాత కూడా మీడియా లో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అయితే తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె పెట్టిన స్టోరీ ఒకటి వైరల్ గా మారింది.

కాగా నిన్న దీపావళి వేడుకలను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకున్నారు. ఈ మేరకు సమంత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనతో దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంది సమంత. ఈ మేరకు ఉపాసన తో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ శిల్ప రెడ్డితో ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల సద్గురు వీడియోను ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ డోంట్ బ్యాన్ క్రాకర్స్ అంటూ కామెంట్ చేసింది సామ్.
ప్రస్తుతం సమంత తన రెమ్యునరేషన్ ను అమాంతంగా పెంచేసిందని సమాచారం. కొత్త ప్రాజెక్టులకు సమంత రూ.3 కోట్లు తీసుకుంటుందని అయితే తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా నిలిచిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమని అధికారకంగా తెలియాల్సి ఉంది. సమంత ప్రస్తుతం రెండు సినిమాల్లో నటించనున్నారు.