
కరోనా సెకెండ్ వేవ్ తో ఖాళీగా కూర్చోవడానికి బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ‘రకుల్ ప్రీత్ సింగ్’. డబ్బుకు బాగా అలవాటు పడిన హీరోయిన్ కదా, సంపాదన ఆగిపోయే సరికి ఆ మాత్రం కాస్త ఇబ్బంది ఉంటుంది. ఆ మధ్య ఈ లాక్ డౌన్ లో యాడ్స్ ఏమైనా దొరుకుతాయా అని తెగ ఆరా తీసింది రకుల్. సినిమా ఇండస్ట్రీలో ప్రతి పనికి ఒక లెక్క ఉంటుందయ్యే.
ఇక హీరోయిన్ల విషయంలో అయితే ప్రతి పనికి లెక్కలే ఉంటాయి. షాప్ ఓపెనింగ్ చేసినా లక్షలు అడుగుతారు. చివరకు సోషల్ మీడియా ఎకౌంట్ లో చిన్న పోస్ట్ పెట్టడానికి కూడా ఇరవై లక్షలు అడిగే నటీమణులు ఉన్నారు. గతంలో రకుల్ కూడా ఓ బ్యాంక్ కి సంబంధించిన యాడ్ ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడానికి పది లక్షలు తీసుకుంది.
ఇలాంటి సంపాదన రకుల్ కి మళ్ళీ దొరకలేదు. దాంతో ఈ రెండో లాక్ డౌన్ పీరియడ్ అంతా, ఇంట్లో ఖాళీగా కూర్చొని కూర్చొని బోర్ గా ఫీల్ అవుతుంది. అందుకే తొందరగా షూటింగులు మొదలైతే బాగుండు అని కోరుకుంటుంది. ‘మళ్ళీ సినిమా సెట్ లోకి వెళ్లే టైం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రతిరోజూ మంచి హెయిర్ స్టయిల్ తో మోడ్రన్ గెటప్స్ తో ముస్తాబై ఎంతో ఎంజాయ్ చెయ్యాలి’ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.
పనిలో పనిగా సెట్ లో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నట్లు సెలవిచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రకుల్ చేతిలో ప్రస్తుతం మూడు హిందీ సినిమాలు ఉన్నాయి. కానీ, సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు డిమాండ్ వస్తుందో, ఉన్న డిమాండ్ ఎప్పుడు పడిపోతుందో చెప్పలేం. ప్రస్తుతానికి అయితే రకుల్ కి డిమాండ్ తగ్గింది.