Actress Radha: ఈ జనరేషన్ కి రాధ అంటే కొంచెం కూడా ఐడియా ఉండకపోవచ్చు. రాధ వెండితెర వైభవం ముగిసి మూడు దశాబ్దాలు దాటిపోతుంది. 80లలో రాధ సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ . రెండు తరాల హీరోలతో ఆమె జతకట్టారు. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి చిరంజీవి ముందు తరం స్టార్స్ తో పాటు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లతో నటించారు. రాధ అంటే డాన్స్ ఐకాన్. రాధ డాన్స్ స్కిల్స్ అద్భుతం. ఆమె గ్రేస్ అదిరిపోయేది. ఆ రోజుల్లో చిరంజీవి-రాధ సిల్వర్ స్క్రీన్ పై పోటీపడి స్టెప్స్ వేసేవారు. ఒక దశాబ్దం పాటు రాధ తిరుగులేని హీరోయిన్ గా పరిశ్రమను ఏలారు.

చాలా కాలం తర్వాత 57 ఏళ్ల రాధ బిగ్ బాస్ వేదికపై కనిపించారు. సీజన్ 6 గ్రాండ్ ఫినాలే గెస్ట్స్ లో ఒకరిగా రాధ హాజరయ్యారు. ఆమె ఎనర్జీ, కాన్ఫిడెంట్ మెస్మరైజ్ చేశాయి. కొంచెం లావయ్యారే కానీ ఆమెలో వృద్ధాప్యపు ఛాయలు కనిపించలేదు. అన్నింటికీ మించి యంగ్ ఫీలింగ్స్, యాటిట్యూడ్. ఆడియన్స్ ఆమె మాటలు, హావభావాలు అలా చూస్తూ ఉండిపోయారంటే నిజం. ఆమె అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే త్వరలో ప్రారంభం కానున్న బీబీ జోడి షో జడ్జిగా ఆమె వస్తున్నారు.
కాగా రాధ ఇద్దరు కూతుళ్లు హీరోయిన్స్ గా పరిశ్రమలో అడుగు పెట్టారు. అయితే ఒక్కరు కూడా సక్సెస్ కాలేదు. పెద్ద అమ్మాయి కార్తీక తెలుగు చిత్రంతోనే అరంగేట్రం చేసింది. నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ లో కార్తీక హీరోయిన్ గా నటించారు. జోష్ పర్లేదు అనిపించుకున్నా కమర్షియల్ గా ఆడలేదు. అయితే రంగం మూవీతో కార్తీక మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు . జీవా హీరోగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ రంగం తమిళ, తెలుగు భాషల్లో విజయం సాధించింది.

తర్వాత కార్తీక ఏకంగా ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. బోయపాటి శ్రీను దమ్ము చిత్రంలో ఒక హీరోయిన్ గా కార్తీకను తీసుకున్నారు. దమ్ము బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. కార్తీక సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. 2015లో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఇక ఆమె చెల్లి తులసిని మణిరత్నం కడలి మూవీతో ఇంట్రడ్యూస్ చేశాడు. కార్తీక ఎంతో కొంత ఫేమ్ తెచ్చుకుంది. తులసి రెండు సినిమాలకే దుకాణం సర్దింది. రాధ నట వారసత్వం కూతుళ్లు నిలబెట్టలేకపోయారు.