Mohan Babu- Vishal: తమిళ హీరో విశాల్ కి ఒకప్పుడు తెలుగు లో మంచి మార్కెట్ ఉంది అనే సంగతి అందరికీ తెలిసిందే..రజినీకాంత్ , సూర్య తర్వాత తెలుగులో జనాలు ఒకప్పుడు విశాల్ సినిమాలకు ఎగబడి వెళ్లేవారు..ఆయన సినిమాలకు ఇక్కడ బంపర్ ఓపెనింగ్స్ దక్కేది..ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో విశాల్ కి ఒక రేంజ్ క్రేజ్ ఉండేది..కానీ ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ రావడం వల్ల తెలుగు ఆడియన్స్ కి కాస్త దూరం అయ్యాడు..కానీ ఇప్పటికీ కూడా ఆయన హిట్ కొడితే తెలుగు లో కలెక్షన్స్ దుమ్ము లేపేస్తాయి.

అందుకు ఉదాహరణే ‘అభిమన్యుడు’ అనే సినిమా..తెలుగు లో ఈ చిత్రం పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది..ఆ తర్వాత విశాల్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి..ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘లాఠీ’ అనే సినిమా చేసాడు..ఈ చిత్రాన్ని ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించాడు..ఈ సినిమా షూటింగ్ సమయం లోనే విశాల్ కి చాలా గాయాలయ్యాయి.
అనేకసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 22 వ తారీఖున తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది..ఈ సందర్భంగా ఆయన తిరుపతి లో SV ఇంజనీరింగ్ కాలేజీ మరియు HDHR కాలేజీ లో విడివిడిగా నిర్వహించారు..HDHR కాలేజీ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మోహన్ బాబు ముఖ్య అతిథి గా హాజరయ్యాడు..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ ‘నేను మా కుటుంబం లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి తప్ప, బయట హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హాజరై 8 ఏళ్ళు అవుతుంది..విశాల్ నాకు ఫోన్ చేసి ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అంకుల్..మీరు కచ్చితంగా రావాలి అన్నాడు..వెంటనే ఓకే చెప్పేసాను..విశాల్ తమిళం నుండి వచ్చిన బిడ్డ..అతని సినిమాలు ఇక్కడ ఎన్నో సూపర్ హిట్స్ అయ్యాయి..’పందెం కోడి’ , ‘పొగరు’ సినిమాలంటే నాకు బాగా ఇష్టం..సినిమాల్లోనే కాదు, నిజజీవితం లో కూడా విశాల్ కి బాగా పొగరు ఉందని నాకు తెలుసు..ప్రతీ మనిషికి పొగరుండాలి..కానీ ఆ పొగరు ఎదురు వాడికి హాని చేసేలా ఉండకూడదు..లాఠీ చిత్రం పందెం కోడి లాగానే సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ బాబా ని కోరుకుంటున్నాను’ అంటూ మాట్లాడాడు.