Actress Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రియాంక తెలుగులో రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా హిందీలో ‘జంజీర్’గా విడుదలైంది. ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ మూవీ అమితాబ్ ఆల్ టైమ్ క్లాసిక్ ‘జంజీర్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో కూడా తన సత్తాను చాటుతూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రియాంకా చోప్రా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ భామ. అయితే సెలబ్రిటీల రిలేషన్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు విడకాలు తీసుకుంటారో ఎవరికి అర్ధం కాదు. తన భర్త నిక్ జోనస్ నుంచి ప్రియాంక చోప్రా విడిపోనుందా అంటే అందుకు బాలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. పెళ్లి తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్ లకు తన భర్త పేరును కూడా కలుపుకున్న ప్రియాంక ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా లోని తన ఖాతా లకు తన భర్త పేరు తొలగించి ప్రియాంక అనే మార్చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నటి సమంత కూడా విడాకులకు కొన్ని రోజులు ముందు తన పేరు ముందు అక్కినేనిని సోషల్ మీడియాలో తొలిగించిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రియాంక చోప్రా కూడా సమంత బాటలోనే విడకులకు సిద్దమవుతుందా అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.