Priyamani Divorce: ప్రియమణి విడాకుల రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చారు. భర్త ముస్తఫా రాజ్ తో ప్రియమణి విడిపోవడం లాంఛనమే అంటున్నారు. ఇప్పటికే విడివిడిగా ఉంటున్న ఈ జంట విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. గత రెండేళ్లుగా ప్రియమణి-ముస్తఫా రాజ్ విడాకులు తీసుకుంటున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. దానికి కారణం వేరుగా జీవనం సాగించడమే. వృతిరీత్యా ముస్తఫా రాజ్ అమెరికాలో ఉంటాడు. ప్రియమణి తన ప్రొఫెషన్ కోసం ఇండియాలో ఉంటున్నారు. ఏడాదికి ఒకసారి కూడా కలవడం కష్టమే. ఫోన్లు, మెసేజ్ లు తప్పితే అరుదుగా కలుసుకుంటారు.

ప్రియమణి-ముస్తఫా రాజ్ విడాకుల రూమర్స్ గతంలో ప్రియమణి ఖండించారు. భర్తతో దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. పరోక్షంగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. మేము బాగానే ఉన్నామని హింట్ ఇచ్చింది. దాదాపు ఏడాది కాలం తర్వాత మరలా ప్రియమణి భర్తతో విడిపోతున్నారంటూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల మాధవన్ నటించిన రాకెటరీ మూవీ సక్సెస్ మీట్ కి ప్రియమణి భర్తతో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో సడన్ గా విడాకుల రూమర్స్ తెరపైకి రావడానికి కారణం తెలియడం లేదు. 2017లో ప్రియమణి వ్యాపారవేత్త ముస్తఫా రాజ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ముస్తఫా రాజ్ కి ఇది రెండో వివాహం. ఆయన మొదటి భార్య ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రియమణితో ముస్తఫా రాజ్ వివాహం చెల్లదని ఆమె ఆరోపిస్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం ఎలా చేసుకుంటాడంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు.

ముస్తఫా రాజ్ మాత్రం ఆమెకు భరణం చెల్లించానని, పిల్లల పోషణ బాధ్యత నెరవేరుస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఇక పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ప్రియమణి-ముస్తఫా రాజ్ పిల్లల్ని కనలేదు. ప్రియమణి ప్రస్తుత వయసు 38 ఏళ్ళు కావడం విశేషం. కెరీర్ లో బిజీగా ఉన్న ప్రియమణి పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేశారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కలిపి ప్రియమణి అరడజనుకు పైగా చిత్రాలు చేస్తున్నారు. ఇక ప్రియమణి విడాకులు తీసుకొని భర్తతో విడిపోతున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.