https://oktelugu.com/

Actress Pragathi: ఆ హీరో బాగా ఇబ్బంది పెట్టాడు, ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోదాం అనుకున్నాను!

పెళ్లి చేసుకోవడం నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ అంటుంది ప్రగతి. భర్తతో విభేదాలు మానసిక వేదనకు గురి చేశాయట. ఒకప్పుడు తిండి కోసం టెలిఫోన్ బూత్, ఫిజ్జా షాప్స్ లో పని చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

Written By:
  • Shiva
  • , Updated On : June 9, 2023 / 11:14 AM IST

    Actress Pragathi

    Follow us on

    Actress Pragathi: నటి ప్రగతి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. దాదాపు అన్ని సినిమాల్లో ప్రగతి ఉంటారు. చక్కని గ్లామర్, టాలెంట్ ఉన్న నటి. అటు మోడరన్ ఇటు ట్రెడిషనల్ రోల్స్ కి సెట్ అవుతారు. చాలా చిన్న వయసులోనే ప్రగతి తల్లి పాత్ర చేశారు. బాబీ మూవీలో మహేష్ బాబు మదర్ రోల్ చేసే నాటికి ఆమె వయసు ముప్పై లోపే. మహేష్ బాబు కంటే చిన్నావిడ ఆయనకు తల్లిగా చేశారు. అయితే ప్రగతి కెరీర్ మొదలైంది హీరోయిన్ గా. 90లలో ప్రగతి కొన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. తక్కువ వయసులోనే వివాహం చేసుకొని పరిశ్రమకు దూరమయ్యారు.

    చాలా గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చింది. పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలు పలుమార్లు ప్రగతి మొహమాటం లేకుండా చెప్పింది. హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో ఒక హీరో కమ్ నిర్మాత ఆమెను బాగా ఇబ్బందిపెట్టాడట. వేధింపులకు గురి చేశాడట. ఆ హీరో కారణంగా పరిశ్రమను వదిలి వెళ్లిపోవాలని ప్రగతి అనుకున్నారట. ఎవరితోనైనా నటిస్తా ఆ హీరోతో నటించేది లేదని ఆమె కుండబద్దలు కొట్టారట. ఆ హీరో పేరు చెప్పని ప్రగతి తీవ్ర అసహనం ప్రదర్శించారు.

    పెళ్లి చేసుకోవడం నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ అంటుంది ప్రగతి. భర్తతో విభేదాలు మానసిక వేదనకు గురి చేశాయట. ఒకప్పుడు తిండి కోసం టెలిఫోన్ బూత్, ఫిజ్జా షాప్స్ లో పని చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. తెలుగు అమ్మాయి అయిన ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాక దశ మారింది. ఆమెకు ఒక కూతురు. సింగిల్ మదర్ గా ఉన్నారు. రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ప్రగతి తేల్చి చెప్పారు. ఆ మధ్య ప్రగతి మరో వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం జరిగింది.

    ఇటీవల ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఎనర్జిటిక్ స్టెప్స్ తో డాన్స్ వీడియోలు చేస్తున్నారు. అలాగే ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యారు. జిమ్ లో గంటల తరబడి కష్టపడుతున్నారు. ప్రగతి వీడియోలను కొందరు తరచుగా ట్రోల్ చేస్తుంటారు. ప్రగతి తనను ట్రోల్ చేసేవాళ్లకు ఘాటైన సమాధానం ఇస్తారు. పని లేని వాళ్ళు చేసే కామెంట్స్ పట్టించుకోనని అంటారు. నా ఆరోగ్యం కోసం నేను జిమ్ చేస్తున్నాను. మీరు ఎగతాళి చేశారని నేను మానను అంటుంది.