Homeఎంటర్టైన్మెంట్స్నానం చేస్తున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్... రెండు నెలలు నిద్రపోలేదు

స్నానం చేస్తున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్… రెండు నెలలు నిద్రపోలేదు

Poorna: హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్స్ సినిమాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. మరోవైపు డిజిటల్ సిరీస్లు, సినిమాలలో ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు దక్కుతున్నాయి. తన ఇమేజ్ ఏమిటో అర్థం చేసుకున్న పూర్ణ… మడిగట్టుకు కూర్చోకుండా… అందివచ్చిన పాత్రలు కాదనకుండా చేస్తుంది. వెంకటేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 2లో పూర్ణ లాయర్ రోల్ చేశారు.

Actress Poorna
Actress Poorna

ఇక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ మూవీలో గవర్నమెంట్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. పద్మావతిగా పూర్ణ నటన ఆకట్టుకుంది. సౌత్ లో పలు భాషలలో నటిస్తున్న పూర్ణ… తెలుగు పాప్యులర్ టాక్ షో ఆలీతో సరదాగా లో పాల్గొన్నారు. అఖండ మూవీలో విలన్ రోల్ చేసిన శ్రీకాంత్ తో పాటు పూర్ణ ఈ వేదిక పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా కెరీర్ తో పాటు పర్సనల్ విషయాలపై ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ముఖ్యంగా దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన హారర్ మూవీ ‘అవును’… ఆమెను రెండు నెలలు భయపెట్టిందట. అవును మూవీలో పూర్ణ లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమెకు ఎలాంటి భయం వేయలేదట. అయితే ఆ చిత్రాన్ని చూసినప్పుడు విపరీతమైన భయానికి లోనైందట. ఏకంగా రెండు నెలలు ఆమె నిద్రకు దూరమయ్యారట. చివరికి బాత్ రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు కూడా పక్కనే ఎవరో కూర్చున్న భావన కలిగేదట. అవును చిత్రం నన్ను ఎంతగానో బయపెట్టిందని పూర్ణ ఒకప్పటి భయానక పరిస్థితులు గుర్తు చేసుకున్నారు.

Also Read: RRR Theatrical Trailer: వైల్డ్ టైగర్ తో యంగ్ టైగర్ పోరాడితే… మైండ్ బ్లాక్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ హైలెట్స్!

ఇక కెరీర్ అనుకున్నంతగా సాగకపోవడానికి… తాను సినిమాపై శ్రద్ధ పెట్టకపోవడమే కారణం అన్నారు. పరిశ్రమలో ఉన్నప్పుడు కొన్నిటికి ఎస్ చెప్పాలి. కానీ నేను నో చెప్పాను. సీమ టపాకాయ్ మూవీ తర్వాత కొన్ని కారణాలతో చాలా ప్రాజెక్ట్స్ వదిలేసినట్లు పూర్ణ వెల్లడించారు. గతంలో పూర్ణ ఓ కిడ్నాప్ గ్యాంగ్ చెరలో చిక్కుకొని.. అదృష్టవశాత్తు బయటపడ్డారు.

Also Read: Flight Accident: ఫైట్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న సినీ ప్రముఖులు వీరే?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular