Pooja Hegde: అలా అనిపిస్తేనే పెళ్లి చేసుకోవాలంటున్న పూజా హెగ్డే

Pooja Hegde: టాలీవుడ్​లో వరుస సినిమాలతో ఫుల్​జోష్​తో దుసుకెళ్లిపోతున్న హీరోయిన్లలో పూజా హెగ్డె ఒకరు. అందం, అభినయం కలగలసి కుర్రకారును పిచ్చెక్కించే కవ్వింపు కొంటెచూపులతో భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రాధేశ్యామ్​ సినిమాతో పాటు, ఆచార్య లోనూ రామ్​చరణ్ సరసన నటిస్తోంది. రాధేశ్యామ్​ సంక్రాంతికి విడుదల అవుతుండగా.. ఆచార్య ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు.. ప్రేమపై తనకున్న అభిప్రాయాన్ని […]

Written By: Raghava Rao Gara, Updated On : December 5, 2021 10:10 am
Follow us on

Pooja Hegde: టాలీవుడ్​లో వరుస సినిమాలతో ఫుల్​జోష్​తో దుసుకెళ్లిపోతున్న హీరోయిన్లలో పూజా హెగ్డె ఒకరు. అందం, అభినయం కలగలసి కుర్రకారును పిచ్చెక్కించే కవ్వింపు కొంటెచూపులతో భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రాధేశ్యామ్​ సినిమాతో పాటు, ఆచార్య లోనూ రామ్​చరణ్ సరసన నటిస్తోంది. రాధేశ్యామ్​ సంక్రాంతికి విడుదల అవుతుండగా.. ఆచార్య ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు.. ప్రేమపై తనకున్న అభిప్రాయాన్ని తెలియజేశారు.. ఆ విశేషాలేంటో చూద్దాం.

ప్రస్తుతం తన కెరీర్​ చాలా బిజీగా ఉందని.. డేట్స్ కుదరదని చెప్పినా.. ఏంఫర్వాలేదు మేడమ్​. మనం మ్యానేజ్​ చెద్దాం అని నిర్మాతలు అంటుంటారు. వాళ్లకు నేను పనిమీద పెట్టే శ్రద్ధ ఏంటో తెలుసు. అందుకో మీకోసమే ఈ పాత్ర రాశాం అని దర్శకులు అన్నప్పుడు.. చాలా జాగ్రత్తగా పనిచేయాలనిపిస్తుంది.

మరోవైపు ప్రేమ బంధంపై తన అభిప్రాయాలు తెలియజేస్తూ.. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు కదా.. కాబట్టి.. అవి చేసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుందని పూజా అన్నారు. ఈ మధ్యే తాను ముంబయిలో ఓ ఇళ్లు కట్టుకున్నట్లు తెలిపారు. ఇళ్లు కట్టేందుకే ఇంతలా శ్రమించాలంటే.. ఇక పెళ్లి ఎలా ఉంటుందో.. అని నవ్వుతూ అన్నారు. వీళ్లతో ఉంటే జీవితంమంతా బాగుంటుంది.. అనిపిస్తేనే పెళ్లి చేసుకోవాలని.. చెప్పారు పూజా. ఇంట్లో ఒత్తిడితోనే.. అందరూ పెళ్లిల్లు చేసుకుంటున్నారనో మాత్రం అసలు చేసుకోవద్దని యూత్​ను ఉద్దేశించి మాట్లాడారు.