https://oktelugu.com/

Actress: 9 ఏళ్లు అందుకే శృంగారానికి దూరం.. బాంబు పేల్చిన హాట్ హీరోయిన్

Actress: తెలుగులో ఎన్టీఆర్ తో ఊసరవెళ్లి కలిసి నటించింది. మరికొన్ని సినిమాల్లో కూడా కనిపించింది. ఈ బ్యూటీ లేటేస్టుగా హాట్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : June 28, 2024 / 12:03 PM IST

    Actress Payal Ghosh Shocking Comments On Irfan Pathan

    Follow us on

    Actress: సినిమా హీరోయిన్ అంటే గ్లామర్ రోల్స్ వరకే చూస్తాం. కానీ కొందరు నటీమణులు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రియల్ లైఫ్ లో ప్రత్యేకంగా ఉంటారు. ఒక్కోసారి వీళ్లు చేసే కామెంట్లు వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. నటీమణి పాయల్ ఘోష్ గురించి సినీ ప్రేక్షకులకు తెలుసు. తెలుగులో ఎన్టీఆర్ తో ఊసరవెళ్లి కలిసి నటించింది. మరికొన్ని సినిమాల్లో కూడా కనిపించింది. ఈ బ్యూటీ లేటేస్టుగా హాట్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేసిందంటే?

    పాయల్ ఘోష్ వివాదా స్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె పలు ఆరోపణలు చేశారు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను వేధించాడని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేరసింది. సినిమా కోసం తనపై అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఆ తరువాత తను మొత్తంగా20 సినిమాలు మాత్రమే చేశానని, అయితే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కవ అని అన్నారు. తాను కొన్నింటికి లొంగిపోతే ఎక్కువ సినిమాలు చేసేదానినని చెప్పింది.

    మొన్నటికి మొన్న క్రికెటర్ మహ్మద్ షమీని పెళ్లి చేసుకుంటానని సంచలన ప్రకటన చేసింది. ఆ తరువాత ఇర్పాన్ పఠాన్ తో డేటింగ్ లో ఉన్నట్లు తెలిపింది. అతని ఫ్రెండ్ గౌతమ్ గంభీర్ కూడా తనకు ఫోన్ చేయడానికి ప్రయత్నించేవాడని తెలిపింది. అయితే ఇర్పాన్ తో డేటింగ్ లో ఉన్నానని, కానీ కొన్ని విషయాల్లో సీరియస్ గా లేనని చెప్పుకొచ్చింది. ఇటీవల ఇర్పాన్ కుటుంబ సభ్యలతో మాట్లాడిన సందర్భంగా కొన్ని విషయాలు చెప్పినట్లు పేర్కొంది.

    ‘ఇర్పాన్ కు నేనెప్పుడు సపోర్ట్ గా ఉండేదానిని. 2016 నుంచి ఇర్పాన్ కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాను. అయితే నేను ముంబై రాగానే ఇర్పాన్ నాకు ఫోన్ చేశాడు. మన పెళ్లికి మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని తెలిపాడు. అప్పటి నుంచి దూరంగా ఉంటున్నాను. ఆ తరువాత కొన్ని రోజులకు ఇర్ఫాన్ చెల్లి ఫోన్ చేసి ఇర్ఫాన్ కు పెళ్లి అయింది అని చెప్పగానే షాక్ అయ్యాను. అయితే ఇది జరిగి ఇప్పటి వరకు తొమ్మిదేళ్లు అవుతోంది. ఇప్పటివరకు నేను వేరొకరితో పడక పంచుకోలేదు. దాని పట్ల నాకు గౌరవం ఉంది. ఎవరితో పడితే వారితో ఉండలేం కదా..’ అని తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పింది.