https://oktelugu.com/

Pavitra Lokesh : పవిత్రాలోకేష్ ను ఇంత గ్లామర్ గా చూసుండరు.. వింటేజ్ హాట్ ఫొటోలు వైరల్

ఇక సమ్మోహనం అనే సినిమా నుంచి పవిత్ర, నరేష్ ఆన్ స్క్రీన్ పై కెమెస్ట్రీ వర్కౌట్ కావడంతో అప్పటి నుంచి వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ప్రేమలో పడ్డట్లు తెలిపారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2023 / 06:44 PM IST

    pavitra lokesh

    Follow us on

    Pavitra Lokesh : లేటు వయసులో ఘాటుగా ప్రేమించుకున్న నరేష్, పవిత్రలు వ్యవహారం ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అందమైన పవిత్రా లోకేష్ ను ప్రేమలో దించేసి పెళ్లి చేసుకున్నాడు నరేష్. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ కొత్త పెళ్లి వైరల్ అయ్యింది.

    అటు పవిత్ర సైతం ఇద్దరితో సంబంధం పెట్టుకొని ఇప్పుడు మూడో వ్యక్తి నరేష్ తో కలిసి అడుగులు వేసింది. ఇంతకీ నరేష్ కంటే ముందు పవిత్రకు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయి? ఎంతమందితో సహజీవనం చేశారు? అసలు పవిత్ర ఎవరు? అంతకు ముందు హీరోయిన్ గా చేసిందని.. గ్లామర్ పాత్రల్లో ఒదిగిందన్నది చాలా తక్కువ మందికి తెలుసు. పవిత్ర నాడే తన అందంతో కుర్రకారు మతులు పొగొట్టింది. నాటి వింటేజ్ ఫొటోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.

    మైసూర్ లో 1979లో జన్మించిన పవిత్ర.. ఆమె తండ్రి లోకేశ్ కూడా నటుడే. ఆయన మరణాంతరం కుటుంబ బాధ్యతలు పవిత్రపై పడ్డాయి. దీంతో ఆమె బాగా చదువుకున్నా కుటుంబం కోసం బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. టెలివిజన్ నటిగా పాపులర్ అయిన తర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఈమె ప్రధానంగా కన్నడం, తెలుగు చిత్రాలలో సహాయక పాత్రలు పోషిస్తుంది.చాలా హాట్ పాత్రల్లో పవిత్ర నటించింది. స్టేజీ, చలన చిత్ర నటుడు మైసూర్ లోకేశ్‌కు కూతురు, ఆమె 16 ఏళ్ల వయసులోనే తన తొలి చిత్రంలో నటించింది.1994 సం.లో నటుడు అంబరీష్ సలహాపై పవిత్ర సినిమాలలో నటించింది. మిస్టర్ అభిషేక్ సినిమాలో ఆమె తొలి పాత్రను పోషించింది. అప్పటి నుండి 150 కి పైగా కన్నడ సినిమాలలో నటించింది.

    ఈ క్రమంలో పవిత్ర పర్సనల్ లైఫ్ కాస్త ఒడిదొడుకులతోనే సాగింది. నరేష్ కంటే ముందు ఆమె సుచేంద్ర ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ అంతకంటే ముందే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అతనితో విడాకులు తీసుకున్నారు. కొంతకాలం తరువాత సుచేంద్ర ప్రసాద్ తో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. దీంతో కొంతకాలం వీరు సహజీవనం చేవారు.2018 నుంచి వీరు దూరంగా ఉంటున్నట్లు పవిత్ర మీడియాకు తెలిపింది.

    ఇక సమ్మోహనం అనే సినిమా నుంచి పవిత్ర, నరేష్ ఆన్ స్క్రీన్ పై కెమెస్ట్రీ వర్కౌట్ కావడంతో అప్పటి నుంచి వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ప్రేమలో పడ్డట్లు తెలిపారు.

    అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులో తల్లి పాత్రల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో బోలెడు సినిమాలున్నట్లు సమాచారం. అయితే నాడు హీరోయిన్ గా నటిగా పవిత్రా లోకేష్ సినిమాల్లో నటించిన హాట్ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి పవిత్రా ఇంత హాట్ నా అని అందరూ కామెంట్ చేస్తున్నారు.