https://oktelugu.com/

Nidhhi Agerwal: 60 ఏళ్ల హీరోలకు 28 ఏళ్ళ హీరోయిన్ సై అంటుంది

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కి 28 ఏళ్ళు. నిధి కచ్చితంగా యంగ్ హీరోయినే. కానీ మేకర్స్ మాత్రం అలా ఫీల్ అవ్వడం లేదు. దాంతో ‘సీనియర్’ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది నిధి అగర్వాల్. ఎలాగూ కుర్ర హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావడం లేదు, దాంతో నిధి అగర్వాల్ చిన్నగా 60 ఏళ్లు పైబడిన హీరోలతో జతకడుతోంది. ఇప్పటికే 50 ప్లస్ అయిన పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది. ఇప్పుడు నిధి అగర్వాల్ వరుసగా రెండు […]

Written By:
  • Shiva
  • , Updated On : June 30, 2022 / 05:21 PM IST
    Follow us on

    Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కి 28 ఏళ్ళు. నిధి కచ్చితంగా యంగ్ హీరోయినే. కానీ మేకర్స్ మాత్రం అలా ఫీల్ అవ్వడం లేదు. దాంతో ‘సీనియర్’ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది నిధి అగర్వాల్. ఎలాగూ కుర్ర హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావడం లేదు, దాంతో నిధి అగర్వాల్ చిన్నగా 60 ఏళ్లు పైబడిన హీరోలతో జతకడుతోంది. ఇప్పటికే 50 ప్లస్ అయిన పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది.

    Nidhhi Agerwal

    ఇప్పుడు నిధి అగర్వాల్ వరుసగా రెండు పెద్ద సినిమాల్లో సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటించబోతుంది. బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రానున్న సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది. ఇంతకుముందు నయనతార, కాజల్ తో జతకట్టేందుకు సీనియర్ హీరోలు ఆసక్తి చూపేవారు. కానీ, ఇప్పుడు ఆ లీగ్ లో శృతి హాసన్, నిధి అగర్వాల్ చేరారు.

    Also Read: Maharashtra CM : మహారాష్ట్రలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్.. సీఎంగా ఫడ్నవీస్ కాదు.. ఎవరంటే?

    నిజానికి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా చేస్తున్న సినిమాలో మొదట హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ, బాలయ్యకి జోడి శృతి హాసన్ అయితే ఫ్రెష్ గా ఉంటుంది అని ఆమెను ఖరారు చేశారు. మొత్తమ్మీద అనిల్ రావిపూడి నిధి అగర్వాల్ కు బాలయ్య సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

    అలాగే, నిధి అగర్వాల్ కి మరో భారీ సినిమా వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రంలో కూడా నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా పెట్టుకుంటున్నారు. మొదట శ్రుతి హాసన్ ను అనుకున్నా.. ఆమె పారితోషికం భారీగా ఉంది. సో, మిగిలిన 30 ప్లస్ హీరోయిన్ లు కంటే నిధి అగర్వాల్ బెటర్ అనిపించింది.

    Nidhhi Agerwal

    మొత్తానికి అందరిలో కల్లా శృతి హాసన్ కొంచెం తెలివిగా సీనియర్ హీరోల సరసన నటించేందుకు ప్రీమియం రేట్ అడుగుతూ ముందుకు పోతుంది. ఇక ఆమె వదులుకున్న సినిమాలన్నీ నిధి అగర్వాల్ దగ్గరకు వస్తున్నాయి. ఎలాగూ నిధి అగర్వాల్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పరిస్థితిలో లేదు కాబట్టి.. వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతుంది.

    Also Read:Naga Chaitanya- Kalyan Ram: కళ్యాణ్ రామ్ కి స్టార్ డైరెక్టర్ ను సెట్ చేసిన నాగచైతన్య

    Tags