https://oktelugu.com/

Actress Nagma: సీనియర్ న‌టి ‘నగ్మా’కు పెళ్లికాకపోవడానికి ఆ హీరోలతో ఎఫైర్సే కారణమా..?

Actress Nagma: అలనాటి అందాల సుందరి, సీనియర్ యాక్టర్ కమ్ పొలిటిషీయన్ నగ్మా నేటికీ పెళ్లి ఎందుకు చేసుకోలేదని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం నగ్మా తన సినీ కెరీర్ మంచిగా కొనసాగుతున్న టైంలో ఆమె పలువురు హీరోలు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ఎఫైర్స్ పెట్టుకోవడం వల్లే ఆమె పెళ్లికి దూరంగా ఉందని, నాలుగు పదుల వయసొచ్చినా ఆమె ఒంటరిగా ఉండటానికి ఈ రీజన్సే కారణమని పలువురు మాట్లాడుకుంటున్నారు. నగ్మా హిందూ, […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 5, 2022 / 11:22 AM IST
    Follow us on

    Actress Nagma: అలనాటి అందాల సుందరి, సీనియర్ యాక్టర్ కమ్ పొలిటిషీయన్ నగ్మా నేటికీ పెళ్లి ఎందుకు చేసుకోలేదని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం నగ్మా తన సినీ కెరీర్ మంచిగా కొనసాగుతున్న టైంలో ఆమె పలువురు హీరోలు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ఎఫైర్స్ పెట్టుకోవడం వల్లే ఆమె పెళ్లికి దూరంగా ఉందని, నాలుగు పదుల వయసొచ్చినా ఆమె ఒంటరిగా ఉండటానికి ఈ రీజన్సే కారణమని పలువురు మాట్లాడుకుంటున్నారు.

    Actress Nagma

    నగ్మా హిందూ, ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. తన తండ్రి హిందూ, తల్లి ముస్లిం.. నగ్మా తండ్రి రాజస్థాన్ జై సల్మేర్‌లోని రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి.. వీరి ఫ్యామిలీ కొంత కాలానికి గుజరాత్ ఆ తర్వాత ముంబైకు షిఫ్ట్ అయ్యింది. నగ్మా తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్రహీరోలతో సినిమాలు చేసింది. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే టీం ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో ఎఫైర్ ఉండేదని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. ఈ విషయం గంగూలీ భార్యకు తెలియడంతో వీరిద్దరి దూరమయ్యారు.

    Also Read: అరెరే.. వర్మ పూర్తిగా మారిపోయాడే !

    ఆ తర్వాత నగ్మా తమిళ హీరో శరత్ కుమార్‌తో కొన్నాళ్లు సీక్రెట్ రిలేషన్ షిప్ కొనసాగించిందట.. ఈ విషయం తెలియడంతో శరత్ కుమార్ మొదటి భార్య అతనికి విడాకులు ఇచ్చిందని టాక్.. కొంతకాలానికి వీరిద్దరి మధ్య గ్యాప్ రావడం, నగ్మా శరత్ కుమార్‌కు దూరమయ్యాక ప్రస్తుత భార్య రాధిక శరత్ కుమార్‌కు దగ్గరైందని తెలుస్తోంది. ఈ ఘటనతో సౌత్ ఇండస్ట్రీలో నగ్మా మొత్తానికే సినిమాలు తగ్గించింది. అనంతరం భోజ్‌పూరి ఇండస్ట్రీలోకి నగ్మా ఎంట్రీ ఇచ్చింది.

    అక్కడ కొన్నాళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన నగ్మా స్టార్ నటుడు రవి కిషన్ తో కొన్నాళ్ల పాటు రిలేషన్ కొనసాగించింది. వీరి గురించి ఇండస్ట్రీ మొత్తం టాక్ నడిచింది. తమ బంధం గురించి రవికిషన్ ఓపెన్ గానే ప్రకటించారట.. చివరగా అతని భార్య రంగంలోకి దిగడంతో రవికిషన్ కూడా నగ్మాకు బ్రేకప్ చెప్పినట్టు వార్తలొచ్చాయి. ఈ కారణంగానే నగ్మా ఇన్నేళ్లు వచ్చినా పెళ్లిచేసుకోకుండా ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతోందని టాక్ వినిపిస్తోంది.

    Also Read: అఫీషియల్ : బాలయ్యకి విలన్ గా స్టార్ హీరో కుమార్తె !

    Tags