Actress Mithila Palkar Mind blowing Poses
Mithila Palkar: మిథిల పాల్కర్ సోషల్ మీడియా సెన్సేషన్. ఈ యంగ్ బ్యూటీ తెలుగులో చేసింది ఒక్క చిత్రమే. అయినా పాపులారిటీ రాబట్టింది. ముంబైలో పుట్టి పెరిగిన మిథుల ఓ షార్ట్ ఫిల్మ్ తో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 2014లో మజ్హా హనీమూన్ టైటిల్ తో మరాఠీ షార్ట్ ఫిల్మ్ చేసింది. 2015లో కట్టిబట్టి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఇమ్రాన్ ఖాన్, కంగనా రనౌత్ లీడ్ రోల్స్ చేశారు.
మిథుల లీడ్ రోల్ చేసిన మొదటి చిత్రం కార్వాన్. ఈ చిత్రంలో లెజెండరీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించారు. అలాగే దుల్కర్ సల్మాన్ మరొక లీడ్ రోల్ చేశారు. అనంతరం చాప్ స్టిక్స్, ఏ బేబీ సిట్టర్స్ గైడ్ టు మాండర్ అనే ఇంగ్లీష్ మూవీ చేసింది. కాకపోతే ఈ చిత్రంలో ఆమెది జస్ట్ గెస్ట్ రోల్. కాగా ఆమెకు టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ దక్కింది. విశ్వక్ సేన్ కి జంటగా ఓరి దేవుడా చిత్రంలో నటించింది.
Also Read: Nindha Movie Review: నింద ఫుల్ మూవీ రివ్యూ…
ఓరి దేవుడా తమిళ్ హిట్ మూవీ ఓ మై కడవలె చిత్రానికి అధికారిక రీమేక్. ఓరి దేవుడా చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ చేశాడు. ఆయన భగవంతు పాత్ర చేశాడు. ఒరిజినల్ ఓ మై కడవలె చిత్రానికి దర్శకత్వం వహించిన విశ్వంత్ మారిముత్తు ఓరి దేవుడా చిత్తాన్ని తెరకెక్కించాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓరి దేవుడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
Also Read: Venkatesh: కూతురు వయసున్న హీరోయిన్ తో వెంకీ రొమాన్స్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్
ఓరి దేవుడా అనంతరం మిథుల మరొక చిత్రం చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. తాజాగా ఆమె స్లీవ్ లెస్ టాప్, ఫ్రాక్ ధరించి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మిథుల కవ్వించే ఫోజులు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇంస్టాగ్రామ్ లో మిథుల తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. ఆమెకు 3 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మిథుల లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
Web Title: Actress mithila palkar mind blowing poses