https://oktelugu.com/

Star Heroine: పెళ్ళికి ముందే పిల్లల కోసం ఆ పని చేసిన స్టార్ హీరోయిన్… ఇలా కూడా చేస్తారా?

కెరీర్ కోసం వ్యక్తిగత జీవితం వదిలేస్తున్నారు. కొందరేమో సహజీవనం చేస్తూ పెళ్లికి ముందే తల్లులు అవుతున్నారు. కాగా తల్లి అయ్యేందుకు మరికొందరు ఆధునిక వైద్య విధానాలు ఆచరిస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 1, 2024 / 05:24 PM IST

    Actress Mehreen Pirzada Opens Up About Freezing Eggs

    Follow us on

    Star Heroine: రాను రాను మనుషుల ఆలోచనా విధానంలో పెను మార్పులు వస్తున్నాయి. సంప్రదాయాలు, సహజ జీవన విధానం మారిపోతుంది. సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు పెళ్లి, పిల్లలు వంటి విషయాలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కెరీర్ కోసం వ్యక్తిగత జీవితం వదిలేస్తున్నారు. కొందరేమో సహజీవనం చేస్తూ పెళ్లికి ముందే తల్లులు అవుతున్నారు. కాగా తల్లి అయ్యేందుకు మరికొందరు ఆధునిక వైద్య విధానాలు ఆచరిస్తున్నారు. కాగా స్టార్ హీరోయిన్ పిల్లల కోసం చేసిన పని చర్చకు దారి తీసింది.

    హీరోయిన్ మెహ్రీన్ తాను ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియకు పాల్పడినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీని కోసం రెండేళ్లు మానసికంగా కష్టపడాల్సి వచ్చింది. చివరికి సాధించాను. ఆనందంగా ఉంది. ఈ పర్సనల్ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టాలా వద్దా అని చాలా ఆలోచించాను అయితే నాలా ఆలోచించే చాల మంది అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఉన్నారు. వారి కోసమే నేను ఈ విషయాన్ని బహిర్గతం చేశానని.. ఇంస్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది.

    ఈ ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు హెల్తీ ఎగ్స్ సేకరించి భద్రపరుస్తారు. వివాహం అయ్యాక పిల్లల్ని కనాలి అనుకుంటే ఆ ఫ్రీజింగ్ ఎగ్స్ ఉపయోగించుకోవచ్చు. వయసు పెరిగాక మహిళల్లో విడుదలయ్యే అండాలు అంత హెల్తీగా ఉండవు. అందుకే చాలా మంది సెలెబ్స్ ఈ ప్రక్రియ పాటిస్తున్నారు. చరణ్ వైఫ్ ఉపాసన సైతం ఎగ్ ఫ్రీజింగ్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కొసమెరుపు.

    మెహ్రీన్ కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్. అలాగే వరుణ్ తేజ్ కి జంటగా నటించిన ఎఫ్ 2 సైతం మంచి విజయాన్ని అందుకుంది. అయితే మెహ్రీన్ కెరీర్లో హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువ ఉన్నాయి. దాంతో స్టార్ కాలేకపోయింది. ఈ మధ్య ఆమెకు ఆఫర్స్ కూడా తగ్గాయి. కాగా గతంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. కారణం తెలియదు కానీ ఈ వివాహం క్యాన్సిల్ చేసుకుంది మెహ్రీన్.