Madhavi Latha – Pawan Kalyan: ‘నచ్చావులే’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది నటి మాధవీలత. ఆ తర్వాత రెండు, మూడు సినిమాల్లో నటించిన అవి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఆ తరవ్త సినిమాలకు దూరంగా ఉంటూ కనుమరుగైన ఈ భామ. అప్పుడప్పుడు సోషల్ మీడియా లో పలు పోస్ట్ లు పెడుతూ నేను కూడా ఉన్నా అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీ విషయాల గురించి తరచూ స్పందిస్తూ ఉండడం మాధవీలత హాబీ అని చెప్పొచ్చు. అంతేకాక ఇటీవల బీజేపీ కండువా కప్పుకొని రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టింది ఈమె.
ఈ మేరకు ఫేస్ బుక్ లో ‘పవన్ కల్యాణ్ గారు… క్రిస్మస్ విషెస్ చెప్పండి. నమ్మినవారికి విషెస్ అని చెప్పండి ఇంకా సంతోషం. మానవాళికి లాంటి పెద్ద మాటలు ఎందుకండి… మీరే మత మార్పిళ్లను ప్రోత్సహించేలా వుంది మీ పోస్ట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బైబిల్‌ని మనమే బోధించనక్కర్లేదు, గౌరవిద్దాం అంతవరకే. మీరు చెప్పిన విషెస్ తప్ప మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు. యూదుల వరకే ఆయన ప్రేమ, మనం యూదులం కాదు… మీ పేజి మెయిన్‌టేన్ చేస్తున్నవాళ్లు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకోవడం మంచిది. ఒక హిందువుగా మీ పోస్టు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను అని మాధవీలత ఫైర్ అయ్యారు. కావాలనే పబ్లిసిటీ కోసం ఇటువంటి పోస్ట్ లు చేస్తున్నారంటూ మాధవీలత పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.