Actress Leena: భర్త గొప్ప స్థాయిలో ఉంటే ఏ ఇల్లాలికైనా అమితమైన ఆనందం కలుగుతుంది. ప్రస్తుతం ఆ నటి కూడా అలాంటి సంతోషాన్నే అనుభవిస్తోంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ ప్రాజెక్టులో తన భర్త కూడా కీలక భాగస్వామి కావడం పట్ల ఆ నటి హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గగన్ యాన్ కోసం ప్రకటించిన నలుగురు వ్యోమగాముల జాబితాలో తన భర్త ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్(Prashant Balakrishnan Nair) గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటి లీనా(actress Leena) మంగళవారం రాత్రి ప్రకటించారు.. ఈ విషయాన్ని ఇన్ స్టా గ్రామ్ వేదికగా వెల్లడించారు.
లీనా(actress Leena) మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా మాత్రమే కాకుండా, రచయిత, స్క్రిప్ రైటర్ గా మంచి పేరు గడించారు. మలయాళం, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో దాదాపు 175 సినిమాల్లో ఆమె నటించారు. ఇటీవల మహీ. వీ. రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన సైతాన్ అనే వెబ్ సిరీస్ లో ముఖ్యపాత్ర పోషించారు. ఆమె నటించిన పాత్రకు మంచి ప్రశంసలే దక్కాయి..లీనా(actress Leena) అంతకుముందు అభిలాష్ కుమార్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకుంది.
విడాకుల అనంతరం ఈ ఏడాది జనవరి 17న ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ను లీనా(actress Leena) వివాహం చేసుకుంది. మొదటి బంధం వల్ల ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని..లీనా(actress Leena) పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం గగన్ యాన్ ప్రాజెక్టు కు సంబంధించి వ్యోమగాముల పేర్లు ప్రకటించిన కొద్ది గంటల తర్వాత లీనా(actress Leena) ఇన్ స్టా గ్రామ్ లో స్పందించింది.. ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన నలుగురు వ్యోమగాములలో తన భర్త కూడా ఉన్నాడని ఆనందాన్ని పంచుకుంది. ” ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన గగన్ యాన్ ప్రాజెక్టులో నలుగురు వ్యోమగాములు పాలుపంచుకుంటున్నారు. ఇందులో నా భర్త ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారు. నా భర్తకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ “ఆస్ట్రోనాట్ వింగ్స్” ను అమర్చారు. ఇది నాకెంతో గర్వకారణం. ఇప్పటివరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సందర్భం ఉండదు. ఈ ఏడాది జనవరి 17న నేను ప్రశాంత్ ను పెళ్లి చేసుకున్నాను. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మా పెళ్లి జరిగిందని” లీనా(actress Leena) ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చారు.
ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్(Prashant Balakrishnan Nair) 1976 లో కేరళలో జన్మించారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ లోని అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను చాటుకున్నారు. స్వోర్డ్ ఆఫ్ ఆనర్ ను పొందారు. 1998 డిసెంబర్లో ఆయన ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ పైలెట్ గా చేరారు. ఏకంగా మూడు వేల గంటల ఫ్లయింగ్ అనుభవాన్ని సాధించారు. కేటగిరి_ ఏ ఫ్లయింగ్ ఇన్ స్ట్రక్టర్ హోదాను సాధించారు. అంతకుముందు ఆయన అమెరికాలోని యూఎస్ స్టాఫ్ కాలేజీలో శిక్షణ పొందారు. ప్రస్తుతం ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన గగన్ యాన్ మిషన్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు..ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్(Prashant Balakrishnan Nair) గగన్ యాన్ మిషన్ కు ఎంపిక కావడం పట్ల దేశంలోని ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
View this post on Instagram