Rangam Heroine: రంగం సినిమా హీరోయిన్ పెళ్లి చేసుకోబోయే ఆ వరుడు ఎవరో తెలుస్తే షాక్ అవుతారు

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసినా స్టార్ కాలేకపోయింది. ఆ తరువాత కోలీవుడ్ వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడా ఆశించిన అవకాశాలు రాలేదు.

Written By: Chai Muchhata, Updated On : October 21, 2023 9:43 am

Rangam Heroine

Follow us on

Rangam Heroine: సినిమావాళ్ల గురించి కొన్ని విషయాలు ఆసక్తిని రేపుతాయి. ముఖ్యంగా వెండితెరపై అలరించిన ముద్దుగుమ్మలు రియల్ లైఫ్ లో ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎవరితో కలిసుంటారు? అని నిత్యం సోషల్ మీడియా వేదికగా చర్చలు పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో వారిపై రూమర్స్ కోకోల్లలుగా వస్తుంటాయి. అయితే కొందరు హీరోయిన్లు చర్చలకు ఆస్కారం ఇచ్చేలా విభిన్న ఫొటోలను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తుంటారు. తాజాగా ఓ బ్యూటీ ఓ వ్యక్తిని ప్రేమగా హగ్ చేసుకున్న ఫొటో బయటపెట్టింది. ప్రస్తుతం సినిమాల్లో ఈ సుందరి పెద్దగా కనిపించకపోయినప్పటికీ సడెన్లీగా ఇలా పిక్ ను రిలీజ్ చేయడంపై ఆసక్తి చర్చ బయటకు వస్తోంది. ఆమె ఎవరితోనో లవ్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ? ఏంటా కథ?

ఆమె మొన్నటి వరకు హీరోయిన్.. ఆమె తల్లి కూడా అలనాడు అలరించిన ముద్దబంతి పూవు లాంటి ముద్దుగుమ్మ. అయితే తల్లిలాగా కూతురు రాణించలకపోయింది. అచ్చొచ్చిన తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసినా స్టార్ కాలేకపోయింది. ఆ తరువాత కోలీవుడ్ వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడా ఆశించిన అవకాశాలు రాలేదు. దీంతో లాభం లేదనుకొని ఓ వ్యాపారం చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో దాదాపు ఆమె గురించి మరిచిపోయారు. కానీ ఒక్కసారిగా ఓ వ్యక్తితో కలిసున్న ఫొటోను రిలీజ్ చేయడం రచ్చ రచ్చవుతోంది.

అలనాటి అందాల తార రాధ గురించి ఎవరూ మరిచిపోరు. తనలాగే తన కూతురు కార్తీక కూడా స్టార్ హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. తెలుగులో ‘జోష్’ సినిమా ద్వారా కెమెరా ముందుకు వచ్చిన కార్తీక కు ఫస్ట్ మూవీనే షాక్ ఇచ్చింది. అయినా అడపాదడపా కొన్ని సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంది. అయినా రాణించలేకపోయింది. ఆ తరువాత తమిళనాడు వెళ్లి ‘రంగం’ సినిమాలో నటించి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా సక్సెస్ అయినా కార్తీక మాత్రం స్టార్ కాలేకపోయింది.

దీంతో బిజినెస్ రంగంలో అడుగుపెట్టిన కార్తీక సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్ట్రాగ్రాం ఖాతాలో ఓ పిక్ హాట్ టాపిక్ గా మారింది. సినిమాలు చేయని తరుణంలో ఓ వ్యక్తితో దగ్గరగా ఉన్న ఫొటోపై రకరకాల చర్చ సాగుతోంది. త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతుందని, ఆ విషయం చెప్పడానికే కార్తీక ఈ పిక్ రిలీజ్ చేసిందని అంటున్నారు. అయితే ఎప్పటిలాగే కార్తీక ఆ పిక్ పై ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వడం లేదు. కానీ ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి సినిమా రంగానికి చెందినవారా? లేక వ్యాపారవేత్తనా? అనే చర్చ సాగుతోంది.