Actress Jyothi: సినీ నటి జ్యోతి అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటి సినిమాల్లో పెద్దగా కనపడట్లేదు గానీ.. ఒకప్పుడు మాత్రం ఆమె బోల్డ్ క్యారెక్టర్లు బాగా చేసేవారు. తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించింది జ్యోతి. అయితే ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పటికే ఆమె సోషల్ మీడియా ద్వారా కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తూనే ఉంది.

ఎప్పుడూ చలాకీగా కనిపించే ఆమె జీవితంలో కూడా కొన్ని అనుకోని దుర్ఘటనలు ఉన్నాయి. కాగా ఆమె వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులే పడిందట ఈ బోల్డ్ బ్యూటీ. ఇవే విషయాలను రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. కాగా ఆమె తనకంటే రెండేళ్లు చిన్న వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ మురిపెం ఎక్కువ సేపు నిలబడలేదు.
Also Read: తెలుగు డైరెక్టర్లు అలా చేస్తారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !
కేవలం రెండేండ్లకే ఆమె భర్తతో విడిపోయిందని చెప్పుకుని బాధ పడింది. తాను పెండ్లి అయిన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చిందని, ఇలా గ్యాప్ రావడం వల్ల కలిసి గడపలేకపోయామని చెప్పారు. తన భర్త దుబాయ్ లో ఉండేవాడని, తనకంటే చిన్న వాడు కావడంతో తన మీద డామినేషన్ చూపించడాన్ని తట్టుకోలేకపోయానని వెల్లడించారు. యంగ్ ఏజ్ లో పెండ్లి చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య మెచ్యూరిటీ లేదని వెల్లడించింది.
ఇద్దరి మధ్య ఇగోలు పెరగడం వల్ల త్వరగానే గొడవలు జరిగి విడిపోయినట్టు వెల్లడించింది. అయితే ఇప్పుడు కెరీర్ మీదనే దృష్టి పెట్టానని, ఇతర విషయాల మీద పెద్దగా ఆసక్తి చూపట్లేదంటూ వెల్లడించింది. కాగా తాను సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకుంటానని, అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని స్పష్టం చేసింది.
Also Read: మంచి అబ్బాయి దొరికితే సహజీవనానికి రెడీ.. నటి షాకింగ్ కామెంట్స్ !
