Actress ileana: దేవదాసు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఇలియానా. సన్నని తీగ వంటి నడుము అందాలతో ప్రేక్షక అభిమానులను పెంచుకుంది ఈ భామ. పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ ఎదిగారు. అయితే కొన్నాళ్ల పాటు కాస్త బొద్దుగా మారి సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఫిజిక్ పై ఇంట్రెస్ట్ చూపుతుంది ఈ అమ్మడు. త్వరలోనే కొత్త ప్రాజెక్టులు చేసేందుకు రెడీ అవుతుంది ఈ భామ.

తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు ఇలియానా. అయితే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అందులో ఒక అభిమాని మీ చేతి మీద ఉన్న ఆ 3 చుక్కల అర్థం ఏమిటి అని అడగక సమాధానం ఇచ్చింది. ఒక పెద్ద చుక్క , రెండు చుక్కలున్న పచ్చబొట్టు చిత్రాన్ని చూపిస్తూ… తన సోదరీమణులతో పాటు తనకు ఉన్న అనుబంధానికి గుర్తుగా చిన్న చుక్కలు ఇలియానా ఒకటి పెద్ద సిస్టర్ మరొకటి బేబీ సిస్టర్ ని చెప్పుకొచ్చింది.
ఈ గోవా బ్యూటీ సినిమాలపై మళ్లీ దృష్టి పెట్టారు హిందీలో ఒక చిత్రంలో నటించనున్నారు తెలుగులో కూడా కొత్త ప్రాజెక్టులు వింటున్నట్లు సమాచారం. 2018 లో వచ్చిన “అమర్ అక్బర్ ఆంటోని “మూవీ అంతగా ప్రేక్షకులను అలరించిన పోవడంతో తెలుగులో ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఈ సినిమాలో కాస్త బొద్దుగా కనిపించడంతో సినిమా అవకాశాలు తగ్గాయని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇలియానా మునుపటిలా అవ్వడానికి వర్కర్స్ చేస్తున్న వీడియోస్ ను కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.