Himaja : ప్రముఖ నటి హిమజ గురించి పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ భామ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక హాట్ షోలు, క్లాసిక్ వేర్ లతో క్లాస్, మాస్ పీపుల్స్ ను ఆకట్టుకుంటూ సినిమాల్లో ఆఫర్లు పొందుతుంది ఈ అమ్మడు. అయితే రీసెంట్ గా హిమజ అరెస్ట్ అయిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో బేజీ వెంచర్ లో ఉన్న హిమజ సొంత విల్లాలో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారని.. హిమజతో సహా 11 మందిని అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. అరెస్ట్ మాత్రమే కాదు హిమజ ఇంట్లో మద్యం, సౌండ్ సిస్టమ్ లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనే వార్తలు రావడంతో హిమజ అభిమానుల ఆందోళన చెందారు.
హిమజ ఇంట్లో జరిగిన గ్రాండ్ పార్టీకి సినీ తారలు హాజరయ్యారు. అందుకే సౌండ్ తో హంగామా చేయండంతో.. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చారని తెలుస్తోంది. ఇక ఈ వార్తలపై నటి హిమజ స్పందించింది. సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి తను అరెస్ట్ కాలేదని తెలిపింది. తాను అరెస్ట్ అయ్యాను, 11 మంది కూడా అరెస్ట్ అయ్యారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. పోలీసులు వచ్చిన మాట నిజం, కానీ తనిఖి చేసి వెళ్లిపోయారు. అంతేకానీ అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లడం లాంటివి ఏవి జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
కొత్త ఇంట్లో దీపావళి వేడుకల కోసం సన్నిహితులను పిలిచామని, పూజా కార్యక్రమాలు నిర్వహించామని హిమజ వెల్లడించింది. కేవలం పోలీసులు వచ్చి ఇంట్లో ఏం జరుగుతుందో ఆరా తీశారని.. వాళ్ల డ్యూటీ వాళ్లు చేసి వెళ్లిపోయారని తెలిపింది. కానీ మీడియాలో మాత్రం ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. దీంతో నేను అరెస్ట్ అయ్యాను కావచ్చని.. ఫోన్లు చేస్తున్నారు. అందుకే నేను అరెస్ట్ కాలేదని ఇలా లైవ్ లోకి వచ్చి చెబుతున్నాను అంటూ వివరణ ఇచ్చింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎవరు చేస్తారో? ఎందుకు చేస్తారో తెలిసిందేగా.. వీటి గురించి మాట్లాడడం కూడా వృథా అంటూ మండిపడింది హిమజ. మొత్తం మీద హిమజ అరెస్ట్ అనే వార్తలపై ఓ క్లారిటీ వచ్చింది.