https://oktelugu.com/

Hamsa Nandini: క్యాన్సర్​తో బాధపడుతున్న ప్రముఖ హీరోయన్.. ఎవరో తెలుసా?

Hamsa Nandini: ” వంశీ అనుమానాస్పదం” చిత్రంతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు హంసానందిని. ఈ సినిమా అనుకున్నంత విజయం అందుకో పోవడంతో ఆమెకు ఆశించినంత మెరకు హీరోయిన్ గా సినిమా అవకాశాలు దక్కలేదనే చెప్పుకోవాలి.ఆ తర్వాత సెకండ్ హీరోయిగానూ, వేంప్ రోల్స్, ఐటెమ్ గాళ్ గానూ పలు చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అత్తారింటికి దారేది,ప్రభాస్ మిర్చి మూవీలోని టైటిల్ సాంగ్ తో హంసానందిని మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు.అయితే తాజాగా ఆమె […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 06:10 PM IST
    Follow us on

    Hamsa Nandini: ” వంశీ అనుమానాస్పదం” చిత్రంతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు హంసానందిని. ఈ సినిమా అనుకున్నంత విజయం అందుకో పోవడంతో ఆమెకు ఆశించినంత మెరకు హీరోయిన్ గా సినిమా అవకాశాలు దక్కలేదనే చెప్పుకోవాలి.ఆ తర్వాత సెకండ్ హీరోయిగానూ, వేంప్ రోల్స్, ఐటెమ్ గాళ్ గానూ పలు చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అత్తారింటికి దారేది,ప్రభాస్ మిర్చి మూవీలోని టైటిల్ సాంగ్ తో హంసానందిని మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు.అయితే తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పోస్ట్ కి నెటిజన్లు షాక్ అవుతారు.

    హంసానందిని తనకి క్యాన్సర్ అంటూ ఇన్‌స్టాలో గుండుతో ఉన్న ఫోటోను ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో టాలీవుడ్ ప్రేక్షకులు షాక్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త నెటిజెన్స్ ను ఆందోళనకి గురి చేస్తోంది.తనకి బ్రెస్ట్ కేన్సర్ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే 18 ఏళ్ళ క్రితం తన తల్లి కూడా ఇదే క్యాన్సర్ తో మరణించదని, తాను ఈ మహమ్మారిని జయిస్తానని నమ్మకముందని తెలియజేశారు.

    ప్రస్తుతం హంసానందిని కిమోథెరపీ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటికీ 9 సైకిల్స్ పూర్తవగా, మరో 7 సైకిల్స్ ఉన్నాయని తెలిపారు. ఈ విషయం పై నెటిజెన్స్ హంసా.. పై బ్రేవ్ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలానే ఆమె యూ ట్యూబ్ లో హంసానందిని అనే పేరుతో కుక్కరీ షోస్ చేస్తున్నారు ఈ భామ.