https://oktelugu.com/

సినిమాటోగ్రఫర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడిని పోలీసులు అరెస్టు చేశారనే వార్త తెలియడంతో టాలీవుడ్లో కలకలం మొదలైంది. శ్యామ్ కే నాయుడు ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడి తమ్ముడు కాగా యంగ్ హీరో సందీప్ కు స్వయనా మేనమామ. టాలీవుడ్లో ఎన్నో సినిమాలకు శ్యామ్ కే నాయుడు పని చేశారు. మంచి సినిమాటోగ్రఫర్ గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్ బాబు నటించిన పోకిరి, బిజినెస్ మేన్, పవన్ కల్యాణ్ నటించిన కెమెరా మెన్ గంగతో రాంబాబు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 27, 2020 / 03:47 PM IST
    Follow us on


    సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడిని పోలీసులు అరెస్టు చేశారనే వార్త తెలియడంతో టాలీవుడ్లో కలకలం మొదలైంది. శ్యామ్ కే నాయుడు ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడి తమ్ముడు కాగా యంగ్ హీరో సందీప్ కు స్వయనా మేనమామ. టాలీవుడ్లో ఎన్నో సినిమాలకు శ్యామ్ కే నాయుడు పని చేశారు. మంచి సినిమాటోగ్రఫర్ గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్ బాబు నటించిన పోకిరి, బిజినెస్ మేన్, పవన్ కల్యాణ్ నటించిన కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమాలకు శ్యామ్ కే నాయుడు కెమెరామెన్ గా పని చేశారు.

    ఇదిలా ఉంటే శ్యామ్ కే నాయుడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారనే చర్చ మొదలైంది. ఛీటింగ్ కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సినీ నటి సాయి సుధ ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నటి సుధ ఎస్ఆర్ నగర్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుది. కాగా నటి సుధ సాయి టాలీవుడ్లో అర్జున్ రెడ్డి మూవీతోపాటు పలు సినిమాల్లో నటించింది.