అమ్మ పాత్రలో ఒదిగిపోయే నటి అన్నపూర్ణ. ఆమె ముఖం చూస్తేనే అమ్మలా కనిపిస్తుంది. అందరు హీరోలతో నటించి మెప్పించిన ఆమె పరిశ్రమలో అందరికి అమ్మలాగే ఉంటుంది. క్లాస్ నుంచి మాస్ హీరోల వరకు అందరు అభిమానించేవారే. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే అన్నపూర్ణమ్మకి దర్శకులు నిర్మాతలు, హీరోలతో చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలు చాలా ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ సినిమా సెట్ లోనే ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి.
ప్రముఖ దర్శకుడు, పరిశ్రమ గురువుగా భావించే దేవదాసు కనకాలతో ఓ భూమి విషయంలో మోసపోయానని చెబుతోంది. ఆయన చనిపోవడంతో ఇష్యూని కోడలు సుమ, భర్త రాజీవ్ కనకాల దగ్గర ప్రస్తావించినా లాభం లేకపోయిందని వాపోయింది. ఎప్పుడు వారికి ఫోన్ చేసినా బిజీ బిజీ వస్తుందని పేర్కొంది. అయితే రాజీవ్ కనకాల తనకేం తెలియదని బుకాయిస్తున్నాడని తెలిపింది.
భూమి విషయం అందరికి తెలిసినా రాజీవ్ కనకాల తనకేం తెలియదని తప్పించుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉందని వెల్లడించింది. ఎవరో చెబితే ఆలోచించకుండా భూమి కొనుగోలు చేశాను. నాకు అమ్మిన భూమిని మళ్లీ వెంచర్ వేసి వేరే వాళ్లకు అమ్మేశారు. ఆయన నాకు భూమి అమ్మిన విషయం కుటుంబంలో అందరికి తెలుసు. కానీ తెలియదని తప్పుకోవడం బాగా లేదు. కాస్త నేను ముందు పోతా కానీ నా వెనుక వాళ్లు కూడా వస్తారు కదా అని చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పట్లో భూమి కొన్నాను. దానికి చాలా గొడవలు అయ్యాయి. రెండున్నర ఎకరాలు కొన్నాను. అది నాకు ఇవ్వకుండా చేశారు. కోర్టులో వేస్తే 12 ఏళ్ల తరువాత తిరిగి నాకు ఇచ్చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కొన్న భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడానికి చూశారు. దానిపై మా తమ్ముడు కోర్టుకు వెళ్తే తిరిగి ఆ స్థలం మాకే వచ్చేసింది. కాకపోతే 12 ఏళ్లు కోర్టులో ఇబ్బందులు పడ్డాం.