https://oktelugu.com/

RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ నుంచి “అలియా భట్” మేకింగ్ వీడియో ఔట్…

RRR Movie: రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూసేందుకు మెగా, నందమూరి అభిమానులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అలానే ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు నటిస్తుండడంతో ఆర్ఆర్ఆర్ పై హైప్ ఎక్కువగానే ఉంది. ఈక్రమంలో ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ నెట్టింట్లో సంచలనం సృష్టించాయి. ఇక డిసెంబర్ 9 న విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 8, 2021 / 02:58 PM IST
    Follow us on

    RRR Movie: రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూసేందుకు మెగా, నందమూరి అభిమానులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అలానే ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు నటిస్తుండడంతో ఆర్ఆర్ఆర్ పై హైప్ ఎక్కువగానే ఉంది. ఈక్రమంలో ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ నెట్టింట్లో సంచలనం సృష్టించాయి. ఇక డిసెంబర్ 9 న విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రతిరోజూ ఆర్ఆర్ఆర్ నుంచి అప్డేట్స్ ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

    actress alia bhat making video out from rrr movie

    Also Read: ఆర్‌ఆర్ఆర్ నుంచి మరో బిగ్ అప్డేట్… కొమరం భీమ్ ప్రోమో రిలీజ్

    తారక్, చరణ్ పాత్రలకు సంబంధించిన పోస్టర్స్, మోషన్ వీడియోస్ విడుదల చేసి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చింది చిత్రయూనిట్. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని సీత పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు. అలియా భట్ ఈ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజా వీడియోలో ఆలియా సీతగా మారే మేకింగ్ వీడియోని చూపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్… అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Also Read: సినిమా రంగం కష్టానికి కారణం.. ఈ సినిమా పిచ్చోళ్లే !