Homeఎంటర్టైన్మెంట్Actor Vishal: మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో విశాల్...

Actor Vishal: మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో విశాల్…

Actor Vishal: హీరో విశాల్… ఎప్పుడు విభిన్న కథాంశాలు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. పందెం కోడి, పందెం కోడి 2, అభిమన్యు, డిటెక్టివ్ వంటి సినిమాలు తెలుగులో విజయం సాధించాయి. ఈ విధంగా తెలుగులో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు హీరో విశాల్. ఈ ఏడాది అతను నటించిన యాక్షన్, చక్ర, ఎనిమి చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘సామాన్యుడు’ సినిమా వచ్చే యేడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల కాబోతోంది.

Actor Vishal
Actor Vishal

Also Read: శ్యామ్​సింగరాయ్​ సినిమాలో హైలైట్​గా నిలిచేది ఆ సీన్లేనట?​

దీనితో పాటు తన ‘డిటెక్టివ్’ మూవీకి సీక్వెల్ గా ‘డిటెక్టివ్ -2’ తీస్తూ, ఫస్ట్ టైమ్ మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు విశాల్‌. అలానే ఎ. వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్‌ ‘లాఠీ’ పేరుతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీలో విశాల్ సరసన సునయన నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా విశాల్ మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అతనితో ‘ఎనిమి’ చిత్రం నిర్మించిన ఎస్. వినోద్ కుమార్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. దీనికి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ఉన్న సినిమాల షూటింగ్స్ పూర్తి కాగానే ఇది సెట్స్ పైకి వెళ్ళే ఆస్కారం ఉంది. కాగా ఇటీవల ఎనిమీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశాల్ మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా ప్రముఖ హీరో ఆర్య ముఖ్య పాత్రలో నటించారు.

Also Read: కేజీఎఫ్​ చాప్టర్​2 నుంచి ఇంట్రెస్టింగ్​ బజ్​.. 3డీలో సినిమా రిలీజ్​?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular