Sonu Sood quits as Punjab state icon : కలియుగ కర్ణుడు అంటూ సోనూసూద్ కి నెటిజన్లు ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఇక పంజాబ్ వాళ్ళు అయితే సోనూ మా ‘పంజాబ్ ఐకాన్’ అని ప్రకటించుకున్నారు కూడా. ఈ హెల్పింగ్ స్టార్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశాడు. తాను ‘పంజాబ్ స్టేట్ ఐకాన్’ హోదా నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాను అని అధికారికంగా ప్రకటించాడు. తాను, ఎన్నికల సంఘం కలిసి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సోనూసూద్ చెప్పారు.
సోనూసూద్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న విషయం ఏమిటంటే.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి పోటీ చేస్తున్నారు. అందుకే, ఆయన ఈ డిసిషన్ తీసుకున్నారు. కాగా నవంబర్, 2020లో భారత ఎన్నికల సంఘం సోనూను పంజాబ్ ఐకాన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కరోనా అనంతరం సాయం అనే పదానికి సోనూసూద్ పర్యాయపదం అయిపోయాడు.
కొన్ని చోట్ల అయితే, సోనూకి ఒక విగ్రహం ఏర్పాటు చేసి పూజలు కూడా జరిపించిన సంఘటనలు ఉన్నాయి. మొత్తానికి కరోనా ఆపద్బాంధవుడిగా సోనూ చేసిన సేవలు, సాయాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే.. కరోనా భారత దేశంలో తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టినప్పటి నుండీ సోనూసూద్ పేరు మారుమ్రోగిపోతూనే ఉంది.
దానికి తోడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా సోనూసూద్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను వారి వారి సొంత ఊర్లకు చేర్చి వారి పట్ల దేవుడు అయ్యాడు సోనూసూద్.
.