
Balakrishna -Sameer : సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ హీరోగానే కాకుండా అన్ స్టాపబుల్ షో హోస్టుగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదే సమయంలో ఆయన బయట కొన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా నిలుస్తారు. ఇటీవల ఆయన గురించి ప్రముఖ నటుడు సమీర్ ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. తాను జనం మధ్యలో ఉన్న సమయంలో బాలకృష్ణ తనను తోసేశాడని అన్నారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ బాలకృష్ణ సమీర్ ను ఎందుకు తోసేశారు? అసలు కథేంటి?
ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న ‘సుమ అడ్డా’ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోగ్రాంకు సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో సుమతో పాటు గిరిధర్, హేమ, సమీర్ లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ‘అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు’ అనే కాన్సెప్టు లో కామెడీ పండించారు. అక్కడున్న కాలేజీ స్టూడెంట్స్ తో నటులు పంచ్ లు వేస్తూ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సుమ అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా రిప్లై ఇస్తారు.
‘మీ గ్లామర్ మెయింటేన్ చేయడానికి ఏం చేస్తుంటారు?’ అని సమీర్ ను సుమ ప్రశ్న వేయగా.. ‘సుమ గారి షో చూస్తుంటాను ’ అని రిప్లై ఇస్తారు. అలాగే గిరిధర్ ను అడగ్గా ‘చికెన్ ప్రైడ్ రైస్ తింటుంటాను’ ని అంటారు. ఇక సమాజంలో ఎవరి వల్ల ఉపయోగం అని సుమ స్టూడెంట్స్ ను ప్రశ్న వేయగా ‘సాయంత్రం 6 అయితే చాలు.. ’ అని అబ్బాయిలు రిప్లై ఇవ్వడంతో షో హోరెత్తుతోంది.
అనంతరం నటుడు సమీర్ పలు విషయాలను షో లో ఉన్నవారితో పంచుకున్నారు. ‘నేను బాలకృష్ణతో నటించే ఓ సినిమాకోసం షూటింగ్ ప్రదేశానికి వెళ్లా. అక్కడ నాతో పాటు బాలకృష్ణ గారు బస్సు దిగారు. షూటింగ్ స్పాట్ కు మేం దిగిన బస్సుకు కొంచెం దూరం ఉంటుంది. అయితే నాతో పాటు బాలకృష్ణ గారు ఉండడంతో ఆయనను ‘ఇప్పుడేం చేద్దాం?’ సార్ అని అడిగాను. దీంతో బాలకృష్ణ గారు చేసేదేమీ లేదు అంటూ బస్ డోర్ వేసేసి నన్ను జనం మధ్యలోనుంచి తోసేశాడు. దీంతో ఆ జనం మధ్య నుంచే నేను షూటింగ్ స్పాట్ కు వచ్చా..’ అని చెప్పడం ఆసక్తిగా మారింది. ఇక ఈ షో మార్చి 4న సాయంత్ర ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.