Homeఎంటర్టైన్మెంట్నవ్వుల రారాజుకు ప్రత్యేక శుభాకాంక్షలు !

నవ్వుల రారాజుకు ప్రత్యేక శుభాకాంక్షలు !

Happy Birthday Rajendra Prasadతెలుగు వెండితెరపై నటకిరీటి ఆయన, తెలుగు హాస్యానికి హీరోయిజమ్ తీసుకొచ్చిన హీరో అయన, ప్రధాన మంత్రులను సైతం అభిమానులుగా మార్చుకున్న మేటి నటుడు ఆయన. ఆయనే రాజేంద్రప్రసాద్. ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు విశేషాలు చూద్దాం.

తెలుగు ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన నిమ్మకూరులోనే పుట్టారు రాజేంద్ర ప్రసాద్. నిజానికి ఎన్టీఆర్ సపోర్ట్ తోనే ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతోనే హీరోగా సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డారు. ఇక ఇండస్ట్రీకి వచ్చే ముందు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా కూడా చేశారు రాజేంద్ర ప్రసాద్.

ఆ తర్వాత ఉద్యోగం వచ్చినా వెళ్ళలేదు. ఈ విషయంలో తన తండ్రితో సైతం గొడవ పడి, రాజేంద్రప్రసాద్ మద్రాసు వెళ్లి అవకాశాల కోసం తిరిగారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సలహా మేరకు చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరి నటనలో మెళుకువులు నేర్చుకున్నారు. కానీ అవకాశాలు రాలేదు. బతకడం కూడా ఆయనకు బాగా కష్టం అయిపోయింది. ఓ సమయంలో సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నారు.

అప్పుడే ఆయనకు డబ్బింగ్ చెప్పమని ఛాన్స్ వచ్చింది. అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీ అయిన ఆయన, ఆ తర్వాత హీరో అయ్యారు. కామెడీ స్టార్ గా ఎదిగారు. ముఖ్యంగా జంధ్యాల, బాపు లాంటి లెజెండరీ దర్శకులతో సినిమాలు చేసే అవకాశం రావడంతో.. ఇక రాజేంద్ర ప్రసాద్ కి తిరుగులేకుండా పోయింది. మెయిన్ గా జంధ్యాల ‘అహ నా పెళ్లంట’ సినిమా తర్వాత, రాజేంద్ర ప్రసాద్ కి స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఇక అక్కడ నుండి నేటి వరకు ఆయన బిజీగానే ఉన్నారు.

అయితే, రాజేంద్రప్రసాద్ కెరీర్ కు స్వర్ణయుగం అంటే మాత్రం.. 90ల కాలమే. 90ల్లో ఎప్రిల్ 1 విడుదల, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, కొబ్బరి బొండాం, పెళ్లి చేసి చూడు, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, ఎదిరింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ఆ ఒక్కటి అడక్కు లాంటి ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలతో ఒక జనరేషన్ కి సూపర్ హీరోగా ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

మరి ఈ నవ్వుల రారాజు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ.. ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version