https://oktelugu.com/

Puneeth Rajkumar: పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన… నటుడు రాజేంద్ర ప్రసాద్

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29 న గుండెపోటుతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పునీత్ మృతితో కర్నాటక చిత్ర పరిశ్రమలోనే కాకుండా… సినీ ఇండస్ట్రీ మొత్తంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన నటనతో ఎంతో మండి అభిమానులను సంపాదించుకున్న పునీత్… సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. 1800 మందికి పైగా పిల్లలకు ఉచిత విద్య, 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధాశ్రమాలు, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 5, 2021 / 12:17 PM IST
    Follow us on

    Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29 న గుండెపోటుతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పునీత్ మృతితో కర్నాటక చిత్ర పరిశ్రమలోనే కాకుండా… సినీ ఇండస్ట్రీ మొత్తంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన నటనతో ఎంతో మండి అభిమానులను సంపాదించుకున్న పునీత్… సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. 1800 మందికి పైగా పిల్లలకు ఉచిత విద్య, 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధాశ్రమాలు, 16 వృద్దాశ్రమాలు, 19 గోశాలలు కట్టించారు పునీత్. అలానే ఆయన తన రెండు కళ్ళను కూడా దానం చేశారు. పునీత్ కళ్ల తోనే నలుగురు కంటి చూపును కూడా పొందారు.

    పునీత్ రాజ్ కుమార్ మరణంతో టాలీవుడ్ సెలబ్రెటీలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ, రానా, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్, అలీ ఇలా పలువురు పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయితే ఇప్పుడు తాజాగా నటుడు రాజేంద్రప్రసాద్ కూడా పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. బెంగుళూరులోని సదాశివ నగర్‌లో గల పునీత్ నివాసానికి వెళ్లిన రాజేంద్ర ప్రసాద్… పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ చిత్రపటానికి నమస్కరించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

    ఇటీవలే హీరో నాగార్జున, రామ్ చరణ్ లు కూడా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సొంత కుటుంబ సభ్యులు దూరమైనట్లుగా ఉందని, ఆయన చనిపోయారంటే తాను నమ్మలేకపోతున్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు. పునీత్ కివరగా నటించిన జేమ్స్ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు.