Prudhvi Raj: ‘శ్యాంబాబు’ ఇక ‘శోభన్ బాబు’.. పృథ్వీ రాజ్ హాట్ కామెంట్స్

సముద్రఖని డైరెక్షన్లో వచ్చిన ‘బ్రో’ మూవీ గత నెలలో రిలీజ్ అయింది. ఈ సినిమాలోని ‘శ్యాంబాబు’ అనే పాత్ర మంత్రి అంబటి రాంబాబును అనుకరించే తీశారని ఆయన ఆరోపించారు.

Written By: Chai Muchhata, Updated On : August 9, 2023 10:22 am

Prudhvi Raj

Follow us on

Prudhvi Raj: పవన్ కల్యాన్ నటించిన లేటేస్ట్ మూవీ ‘బ్రో’ సినిమాపై ఆసక్తి చర్చ సాగుతోంది. ఇందులో ‘శ్యాంబాబు’ అనే పాత్ర తనదేనంటూ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు పెట్టి రచ్చ చేసిన విషయం తెలిసిందే. ‘శ్యాంబాబు’ పాత్రలో నటించిన పృథ్వీరాజ్ మాత్రం మంత్రిలా నటించేంత పెద్దవాడిని కాదని అన్నారు. కానీ ఇప్పుడు ఈ పాత్రను ప్రత్యేకంగా పెట్టి ఓ సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో పృథ్వీరాజ్ కీలకంగా నటించే అవకాశంగా కనిపిస్తోంది. ఓ వైపు సినిమాలపై దృష్టి మాని అభివృద్ధిపై ఫోకస్ పెట్టండి అని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల వేడి కొనసాగుతుండగా.. పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారింది.

సముద్రఖని డైరెక్షన్లో వచ్చిన ‘బ్రో’ మూవీ గత నెలలో రిలీజ్ అయింది. ఈ సినిమాలోని ‘శ్యాంబాబు’ అనే పాత్ర మంత్రి అంబటి రాంబాబును అనుకరించే తీశారని ఆయన ఆరోపించారు. సంక్రాంతి వేడుకల్లో అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ ను బ్రో సినిమాలో పృథ్వీ రాజ్ డ్యాన్స్ చేశాడు. దీంతో తనను ఇరిటేట్ చేయడానికే ప్రత్యేక పథకం వేశారని మంత్రి ప్రెస్ మీట్ పెట్టి బ్రో సినిమా హీరో పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. అంబటి రాంబాబుకు ఇతర మంత్రులు కూడా తోడవడంతో ఢిల్లీ వెళ్లి మరీ కంప్లయింట్ ఇచ్చారు.

ఈ పాత్రలో నటించిన పృథ్వీని కొందరు ప్రశ్నించగా.. తాను ఈ పాత్ర డైరెక్టర్ చెబితే చేశానని, ఎవరిని ఉద్దేశించో ఈ పాత్ర చేయలేదని వివరించారు. ఒకవేళ మంత్రిగారు తనను అనుకరించేనని విమర్శలు చేసినా.. ఆయన పాత్రలో నటించేంత పెద్దవాడిని కాదని పృథ్వీ అన్నారు. కానీ తాజాగా ఆయన సంచలన విషయం బయటపెట్టాడు. బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర 1 నిమిష 5 సెకన్లు మాత్రమే ఉందని, కానీ త్వరలో ఈ పాత్రను బేస్ చేసుకొని సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో శ్యాంబు 2 గంటలు ఉంటాడన్నారు. అంతేకాకుండా ఆ సినిమాకు ‘శోభన్ బాబు’ అనే పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

వాల్తేరు వీరయ్య 200 రోజుల సెలబ్రేషన్లో పాల్గొన్ని రాజకీయంగా కొన్ని విమర్శలు చేశారు. పిచ్చుక పై బ్రహ్మాస్త్రం వదిలినట్లు ప్రతీసారి సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి? అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో మంత్రులు సైతం ఆయనకు కౌంటర్ గా ముందు మీ తమ్ముడు నోరు మూయించాలని అన్నారు. ఇదే సమయంలో పృథ్వీరాజ్ చేసిన ప్రకటన మరింత ఆజ్యం పోసినట్లయింది. అయితే ‘శోభన్ బాబు’ సినిమా ఎవరిని ఉద్దేశించి తీస్తారోనన్న ఆసక్తి చర్చ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.