Prakash Raj: అందాల రాక్షసి చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నవీన్ చంద్ర. ఈ యంగ్ హీరో ప్రస్తుతం డా.మోహన్ దర్శకత్వంలో 1997 అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నవీన్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కోటి, శ్రీకాంత్ అయ్యంగార్, డా.మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిజ సంఘటనలను ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల కాగా… దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఏమి బతుకు ఏమి బతుకు’కు ప్రేక్షకుల మంచి స్పందన లభించింది. కాగా ఇప్పుడు మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మెచ్చుకున్నారు. ఈ మేరకు మూవీ యూనిట్ ను ప్రకాష్ అభినందించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ… నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, డాక్టర్ మోహన్ ముఖ్య పాత్రల్లో… డాక్టర్ మోహన్ దర్శకత్వంలో వస్తున్న 1997 సినిమాలోని పాట విన్నాను అన్నారు. అలానే కథ గురించి కూడా తెలుసుకున్నానని… ఈ రోజుల్లో కూడా మనల్ని బాధ పెడుతున్న సమస్యల గురించి సినిమా తీయడం చాలా మంచి విషయం అంటూ చెప్పారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా 1997 అని… నిజంగా ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన మోహన్ అండ్ టీమ్ కి ధన్యవాదాలు అని తెలిపారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నానన్నారు. ఈ చిత్రానికి పిఆర్ వో గా సురేశ్ కొండేటి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 26 న ధియేటర్లలో సందడి చేయనుంది.
