https://oktelugu.com/

Murali Mohan: శోభన్ బాబు డబ్బుల విషయంలో నిర్మాతలతో ఇంత కఠినంగా ఉండేవాడా..? ఈ విషయంలో కృష్ణ ని దేవుడు అనొచ్చు!

శోభన్ బాబు కి కొడుకు ఉన్నప్పటికీ కూడా ఆయన సినీ రంగంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి, అందులో గొప్పగా రాణించి చెన్నై లో స్థిరపడ్డాడు. ఇక కృష్ణ వారసుసు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మన అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : August 30, 2024 / 01:56 PM IST

    Murali Mohan

    Follow us on

    Murali Mohan: మన టాలీవుడ్ లోని స్వర్ణయుగం లో సూపర్ స్టార్స్ గా కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన హీరోలు శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ. శోభన్ బాబు కి ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉండగా, సూపర్ స్టార్ కృష్ణ కి మాస్ ఆడియన్స్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. వీళ్లిద్దరు ఆరోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగారు. అంతే కాదు వీళ్లిద్దరు కలిసి ఎన్నో మల్టీస్టార్రర్ చిత్రాలు కూడా చేసారు. అవి కమర్షియల్ గా పెద్ద అయ్యాయి. అయితే స్టార్ స్టేటస్ విషయం లో వీళ్లిద్దరు ఒకే రేంజ్ కానీ, వ్యక్తిత్వం విషయంలో వీళ్లిద్దరి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. వీళ్ళిద్దరితో ఎంతో సన్నిహితంగా ఉండే ప్రముఖ నటుడు మురళి మోహన్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో డబ్బు విషయం లో కృష్ణ, శోభన్ బాబు ఎలా ఉండేవారో చెప్పుకొచ్చాడు.

    ఆయన మాట్లాడుతూ ‘కృష్ణ గారు నిర్మాతల పాలిట దేవుడు అనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన తన సినిమా ఫ్లాప్ అయితే, ఆ నిర్మాతని పిలిచి ఉచితంగా సినిమా చేసేవాడు. డబ్బులు కూడా ఫైనాన్షియర్స్ తో మాట్లాడి నిర్మాతలకు ఇప్పించి ఆయనే గ్యారంటీ గా ఉండేవాడు. లాభాలు వస్తే నిర్మాతలకు డబ్బులు ఇచ్చేవాడు. రెమ్యూనరేషన్ సినిమా పూర్తి అయ్యాకనే తీసుకునేవాడు. ఇన్ని రోజులు నా సినీ కెరీర్ లో నిర్మాతల గురించి ఈ స్థాయిలో ఆలోచించిన హీరోనే నేను చూడలేదు. కృష్ణ ఇలా ఉంటే శోభన్ బాబు మాత్రం డబ్బుల విషయంలో నిర్మాతల దగ్గర చాలా కఠినంగా ఉండేవాడు. ఒక సినిమాకి ఆయన సంతకం చేసి షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టాలంటే ముందు ఆయన చేతిలో అడ్వాన్స్ పెట్టాల్సిందే. ఎందుకంటే శోభన్ బాబు తాను సంపాదించిన డబ్బులను మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టేవాడు. కాబట్టి ఆయన మనీ రొటేషన్ ఉండాలి. షూటింగ్ కి వచ్చేటప్పుడు ఎప్పుడూ ఆయన తన చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకొచ్చేవాడు. అందులో ఆయన కొనుగోలు చేసిన భూముల వివరాలు, అలాగే చెల్లించాల్సిన డబ్బులు వివరాలు ఉండేవి. కొంతమంది నిర్మాతలు శోభన్ బాబు కి చెప్పిన సమయంలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు చాలా కష్టపడేవారు. చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వని నిర్మాతలు చాలా ఇబ్బందులను ఎదురుకున్నారు’ అంటూ మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

    ఇది ఇలా ఉండగా శోభన్ బాబు కి కొడుకు ఉన్నప్పటికీ కూడా ఆయన సినీ రంగంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి, అందులో గొప్పగా రాణించి చెన్నై లో స్థిరపడ్డాడు. ఇక కృష్ణ వారసుసు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మన అందరికీ తెలిసిందే. స్టార్ స్టేటస్ విషయంలో మహేష్ బాబు కృష్ణ ని కూడా దాటేసి తండ్రిని మించిన తనయుడిగా, ఇంటర్నేషనల్ స్టార్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు.