Homeఎంటర్టైన్మెంట్Victory Venkatesh: ఆ విషయం లో ఎంతమంది బ్రతిమిలాడినా ఒప్పుకోని విక్టరీ వెంకటేష్

Victory Venkatesh: ఆ విషయం లో ఎంతమంది బ్రతిమిలాడినా ఒప్పుకోని విక్టరీ వెంకటేష్

Victory Venkatesh: మూవీ మొఘల్ దగ్గుపాటి రామానాయుడు గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన వెంకటేష్ ఎంత పెద్ద స్టార్ హీరో అయ్యాడో మన అందరికి తెలిసిందే..విలక్షణమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న వెంకటేష్, తన మూడు దశాబ్దాల కెరీర్ లో ఎన్నో చూసాడు..ఎంతో మంది హీరోయిన్స్ తో నటించాడు..ఇండస్ట్రీ లో పని చేసిన ప్రతి హీరో కి మరియు హీరోయిన్ కి ఎదో రూమర్ ఉంటూనే ఉంటుంది..కానీ వెంకటేష్ గారి మీద ఇప్పటి వరుకు ఒక్క రూమర్ కూడా రాలేదు..అది ఆయన గొప్పతనం..తన పని ఎదో తానూ చేసుకుంటూ పోవడం తప్ప..ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం వంటివి అసలు చెయ్యడు..అందుకే వెంకటేష్ అంటే ఇండస్ట్రీ లో ఉన్న అందరికి ఎంతో ఇష్టం..ఇది ఇలా ఉండగా ఇటీవల ప్రముఖ నిర్మాత మరియు మాజీ మంత్రి మురళి మోహన్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెంకటేష్ గారి గురించి మనకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు..ఆయన చెప్పిన విషయాలని బట్టి చూస్తే వెంకటేష్ ఎంత సున్నితమైన మనిషో అర్థం అవుతుంది.

Victory Venkatesh
Victory Venkatesh

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ గురించి మన అందరికి తెలిసిందే..ప్రతి ఏడాది మా ఎన్నికలు వచ్చాయంటే సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోతోంది..సార్వత్రిక ఎన్నికలు సమయం లో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలలో ఉండడం విడ్డూరం..అయితే ఒక్కప్పుడు ఇలా ఎన్నికలు ఉండేవి కావు..ఇండస్ట్రీ లో కొంతమంది ప్రముఖులు నిర్ణయించిన వారిని ఏకగ్రీవం గా ప్రెసిడెంట్ సీట్ లో కూర్చోబెట్టేవారు..అప్పట్లో స్టార్ హీరోలను మా ప్రెసిడెంట్స్ గా పెట్టేవారు..చిరంజీవి , నాగార్జున మరియు మోహన్ బాబు వంటి వారు ప్రెసిడెంట్స్ గా పని చేసారు.

Also Read: Megastar Chiranjeevi- Sumalatha: మెగాస్టార్ కి అప్పుడు హీరోయిన్ గా, ఇప్పుడు మదర్ గా నటిస్తోంది

Victory Venkatesh
murali mohan

అలాగే విక్టరీ వెంకటేష్ ని కూడా మా ప్రెసిడెంట్ గా ఉండాల్సిందిగా కోరారు..కానీ ఆయన ఒప్పుకోలేదు..ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖులందరూ వెంకటేష్ ని మా ప్రెసిడెంట్ ఉండాలని బ్రతిమిలాడారు..కానీ వెంకటేష్ ‘బయట విషయాలు నాకు ఏమి తెలియవు..ఎలాంటివో విషయాల్లో తలదూర్చడానికి నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు..దయచేసి నన్ను ఇలా ఉండనివ్వండి..నేను ఆ రోల్ కి సరిపడను’ అని చెప్పేవాడట..అయితే మురళి మోహన్ గారు ఆయనని పట్టుబట్టి మరీ ఇబ్బంది పెట్టేలోపు ఆయనని బాధపెట్టడం ఇష్టం లేక ఒకసారి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా పని చెయ్యడానికి వెంకటేష్ ఒప్పుకున్నారట..ఇలా వెంకటేష్ తో తనకి ఉన్న అనుభవం గురించి పంచుకున్నాడు మురళి మోహన్.

Also Read:Vishwak Sen: కుర్ర హీరోతో ముదురు హీరోయిన్ ఫిక్స్.. కొత్త రకం ప్రేమ

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version