చలనచిత్ర రంగంలో మోహన్ బాబుది ప్రత్యేకమైన శైలి. డైలాగ్ డెలీవరిలో ఆయన విధానం ఎవరికి ఉండదు. కథానాయకుడు, ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, నిర్మాత పలు రకాల పద్ధతుల్లో ఆయనది ప్రత్యేకమైన పద్దతి. సినిమా నిర్మాణంలో ఆయన పడిన సమస్యలు అన్ని ఇన్ని కావు. కలెక్టన్ కింగ్ గా 560కు పైగా చిత్రాల్లో ఆయన పలు పాత్రలు పోషించారు. కష్టాలను అధిగమించి కలెక్టన్ లను ఇంటిపేరుగా చేసుకుని కలెక్టన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో తన డైలాగులతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు మోహన్ బాబు.

సినిమాల్లో రాణించడం అంటే మాటలు కాదు. తగిన రీతిలో అవకాశాలు రావాలి. అందుకు అనుగుణంగా ప్రావీణ్యం చూపించాలి. లేదంటే ఎవరు దగ్గరకు రానివ్వరు. సినిమాల్లోకి రాకముందు ఓ పాఠశాలలో రూ.140 వేతనంతో డ్రిల్ మాస్టర్ ఉద్యోగంలో చేరారు. కానీ యాజమాన్యానిది ఆయనది ఒకే కులం కాకపోవడంతో ఉద్యోగలంలోంచి తీసేయడంతో కలత చెంది ఆయనే స్వయంగా విద్యానికేతన్ స్థాపించి అందులో కులం ప్రస్తావన లేకుండా చేశారు.
డైలాగ్ డెలివరీలో మోహన్ బాబుది ఓ డిఫరెంట్ స్టైల్. భాషా ప్రయోగంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అలీతో సరదాగా కార్యక్రమంలో భాగంగా ఆయన తన అనుభవాలు పంచుకున్నారు. సినిమాల్లో తాను పడిన కష్టాలు చెప్పుకున్నారు. పట్టుదల, దీక్షతో నటుడిగా ఎదిగిన క్రమాన్ని వివరించారు. నిర్మాత, నటుడు, కథానాయకుడు పాత్రల్లో మెప్పించి చలనచిత్రాల్లో తనకంటూ ప్రత్యేకత సాధించుకున్నారు.