https://oktelugu.com/

Pawan Kalyan : కెరియర్ మొదట్లో పవన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకున్న నటుడు ఎవరో తెలుసా.?

ఇక పవన్ కళ్యాణ్ లాంటి నటుడు కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లాడు. కాబట్టి సినిమాల పరంగా ఆయన కొంతవరకు దూరంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఒకటి రెండు సినిమాలు చేసిన కూడా అవి సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో వచ్చే విధంగా ప్రణాళికను రూపొందించుకుంటున్నాడు...ఇక ఇప్పుడు రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం గా పెట్టుకొని ఆయన ముందుకు కదులుతున్నాడు...

Written By:
  • NARESH
  • , Updated On : July 9, 2024 / 04:41 PM IST

    What is the situation of Pawan Kalyan producers

    Follow us on

    Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటులందరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి సమయంలోనే చాలామంది నటులు వాళ్ల సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది నటుల మధ్య యాక్టింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మిస్ కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి.

    దానివల్ల ఇద్దరి మధ్య అపార్ధాలు కూడా ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే మరి కొంతమంది సీనియర్ నటులు జూనియర్ల ను డామినేట్ చేయాలనే ఉద్దేశ్యంతో కూడా ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాలు చేసేటప్పుడు సీనియర్ నటుడైన కోట శ్రీనివాసరావు గారితో కొన్ని విభేదాలు వచ్చినట్టుగా కూడా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. అయితే అది మిస్ కమ్యూనికేషన్ వల్ల వచ్చినట్టుగా ఆ తర్వాత వివరణ ఇచ్చినప్పటికీ మొత్తానికైతే కోట గారు పవన్ కళ్యాణ్ తో చిన్నపాటి గొడవ పెట్టుకున్నాడనే వార్తలైతే వచ్చాయి.

    Pawan Kalyan- Kota Srinivasa Rao

    మరి అందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది తెలియదు గానీ, అప్పట్లో మీడియాలో మాత్రం ఈ విషయం గురించి చాలా కథనాలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ఆ తర్వాత కూడా వీళ్ళ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు కోట శ్రీనివాసరావు వృద్ధాప్య దశలో ఉన్నాడు. కాబట్టి ఆయన సినిమాలేమీ చేయకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకప్పుడు లెజెండరీ నటుడి గా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉండటం అనేది నిజంగా ఒక బాధాకరమైన విషయమనే చెప్పాలి.

    ఇక పవన్ కళ్యాణ్ లాంటి నటుడు కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లాడు. కాబట్టి సినిమాల పరంగా ఆయన కొంతవరకు దూరంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఒకటి రెండు సినిమాలు చేసిన కూడా అవి సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో వచ్చే విధంగా ప్రణాళికను రూపొందించుకుంటున్నాడు…ఇక ఇప్పుడు రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం గా పెట్టుకొని ఆయన ముందుకు కదులుతున్నాడు…