
ప్రముఖ సినీ, నటుడు టీవి నటుడు కోసూరి వేణగోపాల్ బుధవారం రాత్రి కరోనాతో మృతి చెందారు. గత 23 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పోందుతున్నారు. కరోనా నెగిటివ్ వచ్చాక కూడా ఆయన కోలుకోలేదని కుటంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య ,కుమారుడు,కూమార్తె ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఆయన ఎఫ్సీఐ లో మేనేజర్ గా పని చేస్తూ పదవీ విరమణ చేశారు. దాదాపు 27 సంవత్సారాలుగా ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో పాత్రలలో నటించారు. ఆయన మృతి పట్ల పలువురు సీని ప్రముఖులు సంతాపం తెలిపారు.
Also Read: అమ్మడు చాలా బీజీ.. ‘ఆర్ఆర్ఆర్’ రెండునెలలే..!
Comments are closed.