Kamal Haasan: విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇప్పటికీ ఏమాత్రం స్పీడ్ తగ్గించడం లేదు. వరుస చిత్రాలతో యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీనిస్తున్నాడు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్నారు. తన సొంత బ్యానర్ పై చిత్రాలను నిర్మిచేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కమల్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా చేస్తున్నాడు. అలానే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తున్నారు.

అయితే కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజు కరోనా మహమ్మారి కేసులు పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా తమిళ్ స్టార్ హీరో కమల హాసన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని… దానితో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం తాను ఆస్పత్రి లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. కరోనా కారణంగా ప్రస్తుతం తాను ఆస్పత్రిలోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు ప్రకటించారు. అలాగే ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించు కోవాలని కమల్ కోరారు. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని కమల్ హాసన్ సూచించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
அமெரிக்கப் பயணம் முடிந்து திரும்பிய பின் லேசான இருமல் இருந்தது. பரிசோதனை செய்ததில் கோவிட் தொற்று உறுதியானது. மருத்துவமனையில் தனிமைப்படுத்திக் கொண்டுள்ளேன். இன்னமும் நோய்ப்பரவல் நீங்கவில்லையென்பதை உணர்ந்து அனைவரும் பாதுகாப்பாக இருங்கள்.
— Kamal Haasan (@ikamalhaasan) November 22, 2021