Homeఎంటర్టైన్మెంట్Chandrahas controversy : బూతు పాట పాడిన చంద్రహాస్ పై కేసు నమోదు..ఏ క్షణం లో...

Chandrahas controversy : బూతు పాట పాడిన చంద్రహాస్ పై కేసు నమోదు..ఏ క్షణం లో అయినా అరెస్ట్ అవ్వొచ్చా?

Chandrahas controversy : ప్రముఖ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్(Hero Chandrahas) హీరో గా తెరకెక్కిన చిత్రం ‘బారాబర్ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాడిన అసభ్యకరమైన పాట సోషల్ మీడియా లో ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెగ్యులర్ గా బూతులు మాట్లాడేవాళ్ళు కూడా చెవులు మూసుకొని అసహ్యించుకునే పాట అది. సోషల్ మీడియా లో వస్తున్న ఈ తీవ్రమైన నెగిటివిటీ ని గమనించి, జనాలు నచ్చడం లేదనే విషయం తెలుసుకొని అయినా వెంటనే వీడియో బైట్ విడుదల చేస్తూ క్షమాపణలు చెప్తారని అంతా అనుకున్నారు. కానీ క్షమాపణ రాకపోగా, ఇదేంటి అని ప్రశ్నించిన అశోక్ అనే వ్యక్తిపై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటూ వీడియో విడుదల చేసాడు. 24 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే నేనెంతో చూపిస్తాను అని బెదిరించసాగాడు.

నిన్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో చంద్ర హాస్ పాడిన పాటకు నిరసన గా అశోక్ కంప్లైంట్ చేయగా, పోలీసులు చంద్ర హాస్ పై సెక్షన్ BNS 296, 296(A), 296(B), 351(2), 67 క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. పబ్లిక్ లో బూతు పాటలు పాడడమే కాకుండా, ఇదేంటి అని ప్రశ్నించినందుకు నాపై బెదిరింపులకు పాల్పడినట్టు ఆయన తన కంప్లైంట్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో దీనిపై ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. చంద్ర హాస్ తన మొదటి సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం సమయం లోనే చాలా పొగరుగా, యాటిట్యూడ్ తో వ్యవహరించాడు. అది బాగా వైరల్ అయ్యి ట్రోల్ అయ్యేలోపు తనకు తానూ యాటిట్యూడ్ స్టార్ అనే పేరు పెట్టుకున్నాడు. ఆడియన్స్ లో తానూ కూడా ఒకడిని ఇండస్ట్రీ లో ఉన్నాను, దయచేసి నన్ను గుర్తించండి అనేలా ఎదో ఒకటి చేసి వార్తల్లో నిలవాలనే తపన తో చంద్ర హాస్ ఈసారి గీత దాటేశాడు.

పోలీసులు ఇతనిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఎదురు అవుతున్న డిమాండ్. ఆ వ్యక్తికీ ఏది మంచిది, ఏది చెడ్డది అనేది కూడా తెలియడం లేదు, ఇలాగే అతన్ని ఫ్రీ గా వదిలేస్తే ఈసారి అటెన్షన్ కోసం ఎలాంటి పనులు చేస్తాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది అయితే ఏమి చూసుకొని ఇతనికి ఇంత పొగరు, బలుపు. సినీ ఇండస్ట్రీ లో మెగాస్టార్, సూపర్ స్టార్ వారసులు కూడా ఈ రేంజ్ అతి చెయ్యరు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version