కరోనా వైరస్ ఎప్పుడు ఎవరి మీద పంజా విసురుతుందో తెలియట్లేదు. టాప్ సెలెబ్రిటీల మొదలు సామాన్యులు దాకా గొప్ప బీదా అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగానికి చెందిన అనేక మంది ఇప్పటికే దీని బారిన పడ్డారు. ఇక ఇండియాలో ప్రముఖ సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడి చికిత్స పొందుతోంది. కొన్ని రోజుల క్రితం హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాంక్స్ అతని భార్య షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి కరోనా పాజిటివ్ గా మారారు ఆ తరవాత వైద్యం చేయించుకొని కోలుకున్నారు. కాగా మరో హాలీవుడ్ నటుడు కరోనా కారణంగా చనిపోవడం జరిగింది.
హాలీవుడ్ లో ఎందరో టాప్ స్టార్స్ కి డైలాగ్ డిక్షన్ ( వివిధ రకాల యాసలు పలకడం ) కోచ్ గా పాపులర్ అయిన ఆండ్రూ జాక్ మార్చ్ 31 న కరోనా వైరస్ కారణంగా చనిపోయాడు. `ది లార్డ్ అఫ్ ది రింగ్స్` వంటి విభిన్న చిత్రాలకు ఆయన నేర్పిన భాష ( యాస ) ఆ చిత్ర విజయాలకు ఎంతగానో తోడ్పడింది. అలాగే జేమ్స్ బాండ్ గా నటించిన పియర్సన్ బ్రాన్సన్ వంటి స్టార్స్ కి కూడా డైలాగ్ పలకడం లో శిక్షణ ఇవ్వడం ద్వారా పేరు తెచ్చుకొన్నాడు. ఇక ఆండ్రూ జాక్ నటించిన చిత్రాల్లో “స్టార్ వార్స్” సిరీస్ అతనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.
ఆండ్రూ జాక్ మరణ వార్త ఆయన భార్య గాబ్రియేల్ రోజర్స్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆండ్రూ జాక్ కొద్దిరోజులుగా కరోనా వైరస్ కారణంగా బాధపడుతున్నాడు. కాగా ఆండ్రూ జాక్ వయసు 76ఏళ్లుగా తెలుస్తోంది.