Comedian AVS: ‘ఆయన అద్భుత హాస్య నటుడు అండి, అలాగే మంచి రచయిత కూడా, అదే విధంగా దర్శకుడు కూడా అండీ’. ఎదురుగా మేనేజర్ మాటలు వింటూ కూర్చున్న దర్శకుడు బాపు గారు ‘ఏమిటయ్యా ?’ ఒక మనిషి ఇన్ని ఎలా అయ్యాడు ? అంటూ ‘బయట ఉన్న ఆయన పిలవండి’ అనగానే.. ‘ఆమంచి వెంకట సుబ్రమణ్యం’ అనే బక్కపలుచని వ్యక్తి మొహమాట పడుతూ బాపు గారికి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. ‘బాగున్నారండీ.. మీ గురించి ఇప్పటికే ఎక్కువ వినేశాను.

ఇక మీరు చెప్పేది ఏమి లేదు. మీకు వేషం ఖాయం’ అంటూ బాపు గారు లేచి బయటకు వెళ్ళారు. చెప్పినట్టుగానే బాపు గారు తన ‘‘మిస్టర్ పెళ్ళాం’’ సినిమాలో వెంకట సుబ్రహ్మణ్యం ని పిలిపించి మరీ మంచి పాత్ర ఇచ్చారు. వెంకట సుబ్రహ్మణ్యం కూడా ఆ పాత్రలో జీవించాడు. మొదటి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వ నుంచి నంది అవార్డు సాధించాడు.

ఆ తర్వాత కాలంలో.. ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం కాస్త ఎ.వి.ఎస్(Comedian AVS) గా పేరు గాంచాడు. హాస్య నటుడు, రచయిత, దర్శకుడిగానే కాకుండా.. తర్వాత రోజుల్లో నిర్మాతగా మారాడు, రాజకీయ నాయకుడిగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గా పనిచేశారు. అందుకే.. బాపు గారు ఎ.వి.ఎస్ ను చూడగానే.. ‘మీరు గొప్పవారు అండి’ అని నవ్వే వారట.
ఎ.వి.ఎస్ 1957వ సంవత్సరం జనవరి 2న జన్మించాడు. వీ.ఎస్.ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. కాలేజీ రోజుల్లోనే రంగస్థల ప్రవేశం చేశాడు. సినిమాల్లోకి వచ్చాక, కేవలం 19 ఏళ్లలోనే ఏవీఎస్ 500 చిత్రాల్లో నటించి మెప్పించాడు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా, సూపర్ హీరోస్ చిత్రం ద్వారా దర్శకుడుగా కూడా మారాడు.
నిజానికి ఆంధ్రజ్యోతి లో పాత్రికేయుడుగా ఏవీఎస్ కేరీర్ ప్రారంభించి ఉన్నత స్థానానికి ఎదగడం గర్వకారణమే. అయితే, ఆయన ఎదగడానికి కారణం కుటుంబ సభ్యులు అట. సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆయనను ఆదరించలేదు. ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు సాయం చేయడానికి ఒక్క మనిషి కూడా ముందుకు రాలేదట. అయినవాళ్ల నిర్లక్ష్యాన్ని చూసే ఆయన ఎదగాలనే కసితో ఎదిగారు.
Also Read: పెద్దాయనతో రష్మిక ప్రేమ.. రష్మిక టాలెంట్ కి ఫిదా !