Naga Chaitanya: టాలీవుడ్ లో ప్రస్తుతం భారీ సినిమాల నిర్మాణం జరుగుతుంది. టాప్ రేంజ్ హీరోలు మాత్రమే కాకుండా మిడ్ రేంజ్ హీరోలు కూడా భారీ సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా అక్కినేని నాగ చైతన్య కూడా ఈ లీగ్ లో చేరిపోయాడు. గతంలో ప్రేమమ్ మరియు సవ్యసాచి లాంటి సినిమాలు అందించిన చందు మొండేటి తో కలిసి అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ నిర్మాణం లో బన్నీ వాసు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు.
మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా హీరో నాగచైతన్య, చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు గురువారం శ్రీకాకుళంలోని మత్స్యకారులను స్వయంగా కలిసి వారి జీవనశైలిని, సంస్కృతి ని స్వయంగా చూసి, అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వైజాగ్ పోర్ట్ ను కూడా సందర్శించారు. మత్స్యకారులతో కలిసి చేపల వేటకు వెళ్లారు. సముద్ర ప్రయాణం, వేట, ఎక్కడ ఎదురైయ్యే పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే భారీ సినిమా నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమా కూడా మత్స్యకారుల నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య కూడా ఇదే నేపథ్యంలో సినిమాకు తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
2021 లో లవ్ స్టోరీ సినిమా తో హిట్ అందుకున్న చైతూ, ఆ తర్వాత బంగార్రాజు, థ్యాంక్ యు, లాల్ సింగ్ చద్దా ఆ తర్వాత కస్టడీ కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. అదే సమయంలో మిగిలిన హీరోలు మంచి హిట్స్ అందుకోవటం కూడా నాగ చైతన్య మీద ఒత్తిడి పెరిగింది. దీంతో సరైన హిట్ కోసం చైతూ ఎదురుచూస్తున్నాడు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కోసం గట్టి వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే కథలో భాగంగా మెయిన్ లైన్ ఫిక్స్ చేసుకున్నారు. ఇక బౌండెడ్ స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత షాట్ కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.